Niharika Konidela : గంగూబాయిని దించేసిన నిహారిక.. వైరలవుతున్న ఫొటోలు..

September 21, 2022 8:14 AM

Niharika Konidela : మెగాబ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆలియా భట్‌ నటించిన గంగూబాయ్‌ లుక్‌లో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన గంగూబాయి మూవీ బాక్సాఫీస్‌ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్రసింహా బర్త్‌డే పార్టీకి వచ్చిన నిహారిక.. గంగూబాయిలా హల్చల్‌ చేసింది. క్యాస్టూమ్‌ పార్టీ అంటేనే డిఫ‌రెంట్‌ గెటప్‌లో హాజరుకావడం. ఈ పార్టీకి నిహారిక గంగూబాయ్‌ లుక్‌లో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ముంబైకి చెందిన లేడీ డాన్‌ గంగూబాయ్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో గంగూబాయ్‌ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Niharika Konidela latest photos as gangubai viral
Niharika Konidela

ఈ సినిమాలో అలియా భట్‌ గంగూబాయి పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించి మెప్పించింది. ఇందులో వైట్‌ శారీలో నుదుట బొట్టుతో ఆకట్టుకుంది. ఇక నిహారిక భర్త చైతన్య ఈ పార్టీకి వకీల్‌సాబ్‌ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ గెటప్‌లో హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలకు లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. సూపర్, సౌత్ ఇండియా గంగూబాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now