Niharika : నిహారిక‌కు వార్నింగ్ ఇచ్చిన అత్తింటి వారు..? ఆ వీడియో గురించే..?

March 11, 2022 7:41 PM

Niharika : మెగా డాట‌ర్ నిహారిక‌.. ఈమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తెగా ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. ప‌లు వెబ్ సిరీస్‌ల‌తోపాటు సినిమాల్లోనూ న‌టించి న‌టిగా గుర్తింపు పొందింది. అయితే సినిమాలు ప‌రాజ‌యం పాలు కావ‌డంతో ఈమె మ‌ళ్లీ సినిమాల వైపు చూడ‌లేదు. పెళ్ల‌య్యాక మాత్రం నిర్మాత‌గా మారి ప‌లు సిరీస్‌ల‌ను నిర్మించింది. అయితే సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నిహారిక ఈ మ‌ధ్య త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆమె ఎందుకు అలా చేసిందో అప్ప‌ట్లో తెలియ‌లేదు. కానీ దాని వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Niharika got strong warning from her mother in law house
Niharika

కొణిదెల నిహారిక‌కు 2020వ‌ సంవ‌త్స‌రంలో డిసెంబ‌ర్ 9న చైత‌న్యతో వివాహం అయింది. కాగా అత‌ను పోలీస్ అధికారి ప్ర‌భాక‌ర్ రావు కుమారుడు. ఇక వారి వివాహాన్ని రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో ఘ‌నంగా జ‌రిపించారు. ఈ క్ర‌మంలోనే వీరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. ఇక నిహారిక త‌న‌కు పుట్టింటి క‌న్నా అత్తింటిలోనే ఎక్కువగా స్వేచ్ఛ ల‌భిస్తుంద‌ని.. ఇంట్లో అయితే త‌న త‌ల్లి త్వ‌ర‌గా నిద్ర లేపుతుంద‌ని.. కానీ అత్తింట్లో అయితే బారెడు పొద్దెక్కినా ఎవ‌రూ నిద్ర‌లేప‌ర‌ని.. నిహారిక ఒక సంద‌ర్భంలో త‌న అత్తింటి వారిని మెచ్చుకుంది. అయితే ఆమెకు అంత స్వేచ్ఛ ఉన్నా.. ఆమె కొన్ని విష‌యాల్లో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించింద‌ని తెలిసింది.

ముఖ్యంగా నిహారిక త‌న జిమ్ ట్రైన‌ర్ వీపు మీద కూర్చుని ఉండ‌గా.. అత‌ను పుష‌ప్స్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇటీవ‌ల‌ వైర‌ల్‌గా మారింది. అయితే ఆ వీడియోపైనే నిహారిక‌కు త‌న‌ అత్తింటి వారు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే నిహారిక మ‌న‌స్థాపం చెందింద‌ని.. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోను డిలీట్ చేయ‌కుండా.. మొత్తం ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న విష‌యం తెలియాల్సి ఉంది..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment