Nidhi Agarwal : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎందరో మనసులని గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. తెరపై గ్లామర్ డాల్‌గా కనిపించడం కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే తనకిష్టమని చెబుతోంది అందాల నిధి. ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కల్యాణ్‌కు జోడీగా ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రంగా హరిహర వీరమల్లు రూపొందుతుండగా, ఈ చిత్ర విశేషాలను నిధి అగర్వాల్ ఇటీవల పంచుకుంది. ‘‘వీరమల్లు..’లో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర ఇది. శారీరకంగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం చాలా ఆభరణాలు ధరించాను. ఒంటిపై ధరించిన కాస్ట్యూమ్స్ చాలా బరువైనవి. ప్రతీదీ చేతితో కుట్టినదే. అందుకే వీటిని క్యారీ చేస్తూ.. షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేది.. అని పేర్కొంది.
షాట్ అయిపోయాక మిగతా సినిమాలలో పడుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ మాత్రం కుర్చీలోకూర్చోవడమే. ఈ కష్టమంతా నాకెంతో విలువైనదిగా అనిపించేది. నటిగా ఇంత అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని నిధి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘హీరో’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా చాలా హోప్స్ పెట్టుకుంది నిధి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…