గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nidhi Agarwal : ఆ సినిమా కోసం చాలా బాధ‌ను అనుభ‌వించానంటున్న‌ నిధి అగ‌ర్వాల్‌..!

Nidhi Agarwal : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంద‌రో మ‌న‌సుల‌ని గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. తెరపై గ్లామర్‌…

Nidhi Agarwal : ఆ సినిమా కోసం చాలా బాధ‌ను అనుభ‌వించానంటున్న‌ నిధి అగ‌ర్వాల్‌..!
Nidhi Agarwal said she faced problems in shooting of hari hara veera mallu

Nidhi Agarwal : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంద‌రో మ‌న‌సుల‌ని గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. తెరపై గ్లామర్‌ డాల్‌గా కనిపించడం కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే తనకిష్టమని చెబుతోంది అందాల నిధి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

క్రిష్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రంగా హ‌రిహ‌ర వీర‌మల్లు రూపొందుతుండ‌గా, ఈ చిత్ర విశేషాలను నిధి అగర్వాల్‌ ఇటీవల పంచుకుంది. ‘‘వీరమల్లు..’లో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర ఇది. శారీరకంగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం చాలా ఆభరణాలు ధరించాను. ఒంటిపై ధరించిన కాస్ట్యూమ్స్‌ చాలా బరువైనవి. ప్రతీదీ చేతితో కుట్టినదే. అందుకే వీటిని క్యారీ చేస్తూ.. షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేది.. అని పేర్కొంది.

షాట్ అయిపోయాక మిగ‌తా సినిమాల‌లో ప‌డుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇక్క‌డ మాత్రం కుర్చీలోకూర్చోవ‌డ‌మే. ఈ కష్టమంతా నాకెంతో విలువైనదిగా అనిపించేది. నటిగా ఇంత అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని నిధి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘హీరో’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా చాలా హోప్స్ పెట్టుకుంది నిధి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి