Nidhhi Agerwal : బాలయ్య‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌.. కాంబినేష‌న్ అదిరిపోతుందంతే..!

Nidhhi Agerwal : బాల‌కృష్ణ సినిమా వ‌స్తుందంటే చాలు.. అభిమానుల‌కు పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న సినిమాల‌కు థియేట‌ర్ల‌లో బాక్సులు ద‌ద్ద‌రిల్లిపోతాయి. అంత‌లా ఆయ‌న సినిమాల ప్రభావం ఉంటుంది. ఇక ఈయ‌న ఈమధ్యే అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. చాలా రోజుల త‌రువాత బాల‌య్య మ‌ళ్లీ ఈ చిత్రం ద్వారా హిట్ కొట్టి జోరు మీదున్నారు. కరోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ అఖండ వ‌సూళ్ల‌లో సునామీని సృష్టించింది. ఈ క్ర‌మంలోనే అఖండ జోష్‌తో బాల‌య్య వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో శృతి హాస‌న్‌తో క‌లిసి సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీ అనంత‌రం ఆయ‌న అనిల్ రావిపూడితో మూవీ చేయ‌నున్నారు.

ఇక అనిల్ రావిపూడి సినిమాలో బాల‌య్య కుమార్తెగా శ్రీ‌లీల న‌టించ‌నుంది. అయితే బాల‌య్యకు ఇందులో హీరోయిన్‌గా ముందుగా ప‌లువురి పేర్లు వినిపించాయి. వారిలో ప్రియ‌మ‌ణి పేరు ఒక‌టి. కానీ ఆమెకు కాల్ షీట్స్ అడ్జ‌స్ట్ కావ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో ఆమెకు బ‌దులుగా ఈ మూవీలో నిధి అగ‌ర్వాల్‌ను తీసుకుంటార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే నిధి అగ‌ర్వాల్ న‌క్క తోక తొక్కింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది చిన్న హీరోల‌తోనే. అగ్ర హీరోల‌తో న‌టించ‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తోంది. కానీ ఈ మూవీ షూటింగ్ అర్థాంత‌రంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమా మ‌ళ్లీ ఎప్పుడు మొద‌ల‌వుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌దు. మ‌రోవైపు వేరే సినిమాల‌కు కూడా ఈమె ఓకే చెప్ప‌లేదు. క‌నుక బాల‌య్య లాంటి అగ్ర‌హీరో సినిమాలో హీరోయిన్‌గా ఆఫ‌ర్ వ‌స్తే కాద‌న‌లేదు క‌దా. కాబ‌ట్టి ఈమె ఈ మూవీకి ఓకే చెప్పింద‌నే తెలుస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Nidhhi Agerwal

ఇక నిధి అగ‌ర్వాల్ చివ‌రిసారిగా అశోక్ గ‌ల్లాతో క‌లిసి హీరో అనే మూవీలో న‌టించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఆ త‌రువాత ఈమె మూవీలు ఏమీ రిలీజ్ కాలేదు. అయితే బాల‌య్య‌తో సినిమా చేస్తే అది ఈమెకు కాస్త బూస్టింగ్ ఇస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఈమెకు మ‌ళ్లీ ఆఫ‌ర్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక బాల‌య్య సినిమాలో ఈమె న‌టించే విష‌య‌మై అధికారికంగా వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM