గురువారం, జూన్ 11, 2026
వార్తలు

నువ్వు సినిమాలు చేయ‌డం మానెయ్‌.. మెగాస్టార్‌పై దారుణ‌మైన ట్రోల్స్‌..

సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్‌ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే…

నువ్వు సినిమాలు చేయ‌డం మానెయ్‌.. మెగాస్టార్‌పై దారుణ‌మైన ట్రోల్స్‌..

సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్‌ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తు రాదు..!? దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ మిస్ అయింది.

దీంతో ఆచార్య ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవిపై పడింది. సినిమా బాక్సాఫీస్ పరాజయం ఒకెత్తయితే.. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున చిరంజీవి బింబిసార, సీతా రామం గురించి ట్వీట్ చేశారు. ఆ సినిమాలకు వస్తున్న పాజిటివ్ బజ్ పై వారికి అభినందనలు తెలిపారు మెగాస్టార్.

netizen troll chiranjeevi for his comments on latest movies

అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు సినిమాలు చేయడం మానేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది, డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగుంటారు ప్లీజ్ టాలీవుడ్‌ ని కాపాడండి బాసు.. అని కామెంట్ చేశాడు. మెగాస్టార్, రామ్ చరణ్.. అబ్బా, కొడుకులు చేసిన లాస్ ఎఫెక్ట్ ని కళ్యాణ్ రామ్ ఎత్తి పడేశాడు. నీకెందుకు మెగాస్టార్ ట్యాగ్ చెప్పు.. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

అయితే చిరంజీవి లాంటి మెగాస్టార్‌ని ఇలా కించపరిచేలా ఒక్క ఫ్లాప్‌ని వాడుకోవడం పూర్తిగా అన్యాయం అనే చెప్ప‌వచ్చు. సోషల్ మీడియా ట్రోల్స్ ఒక విషయం అయితే.. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో చిరుని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదు.. అని మెగా ఫ్యామిలీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి