Allu Arjun : అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఆయనకు ఎంతటి పేరును తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ క్రమంలోనే పుష్ప ఇచ్చిన జోష్‌తో ఆ మూవీకి గాను రెండో పార్ట్‌ను చిత్రీకరించే పనిలో పడ్డారు. అయితే దర్శకుడు సుకుమార్ ఇప్పటికే పుష్ప 2 కథను సిద్ధం చేశారని సమాచారం. కానీ కేజీఎఫ్ 2 ఫీవర్ కారణంగా కథకు ఇంకా మార్పులు చేయాలని చూస్తున్నారట. కేజీఎఫ్ 2ను మించి యాక్షన్, డ్రామా ఉండాలనే ఉద్దేశంతో సుకుమార్ ఆ దిశగా కథను మార్చుతున్నారట. అందుకనే పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఇక పుష్ప మొదటి పార్ట్‌లో అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ డైలాగ్‌ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఇప్పటికీ అనుకరిస్తున్నారు. అయితే పుష్ప 2కు గాను ఇంకో భిన్నమైన మ్యానరిజంను పరిచయం చేయాలని చూస్తున్నారట. అలాగైతేనే సినిమా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్తుంది. తగ్గేదేలే డైలాగ్‌ను.. మ్యానరిజాన్ని మళ్లీ రెండో పార్ట్‌లోనూ ఉంచితే పెద్ద తేడా ఏమీ ఉండదు. కొత్తదనం ఉండదు. కనుక భిన్నమైన డైలాగ్‌తో కూడిన మ్యానరిజాన్ని పుష్ప 2లో చూపించనున్నారట. ఇందుకు గాను బన్నీ చిత్తూరు జిల్లా యాసపై మరింత ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక పుష్ప 2 లో బన్నీ మేకోవర్‌ను కూడా కాస్త మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కొత్త లుక్‌తో కూడిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ కొత్త లుక్‌తో తాజాగా దర్శనమిచ్చాడు. ఇందులో ఇంకాస్త జుట్టు పెంచి కొద్దిగా లావు అయినట్లు కనిపిస్తున్నాడు. ఇది పుష్ప 2 కోసం ట్రై చేస్తున్న కొత్త లుక్కేనని అంటున్నారు. అయితే ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. వీటిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బాగుందని కామెంట్లు చేస్తుంటే.. కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లను పెడుతున్నారు. ఈ లుక్‌లో నువ్వు వడాపావ్‌లా ఉన్నావ్.. అని కొందరు అంటుండగా.. రోజు రోజుకీ బన్నీ బుద్ధుడిలా తయారవుతున్నాడని అంటున్నారు. అలాగే ఇంకొందరు శ్రీలంక క్రికెటర్ మలింగా మాదిరిగా ఉన్నావని అంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2లో అసలు బన్నీ ఎలా కనిపించబోతున్నాడు.. అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…