Karan Arjun Movie Review : క‌రణ్ అర్జున్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Karan Arjun Movie Review : చిన్న సినిమాల‌ను ఓటీటీల్లోనే కాదు.. థియేట‌ర్ల‌లోనూ ప్రేక్ష‌కులు ప్ర‌స్తుతం ఎంతో ఆద‌రిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే అనేక మూవీలు రిలీజ్ అయి హిట్ సాధించాయి. ఇక ఇదే కోవ‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే క‌ర‌ణ్ అర్జున్ అనే మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ జూన్ 24న పెద్ద ఎత్తున ఏకంగా 186 థియేట‌ర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా అల‌రించింది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం.. క‌ర‌ణ్ అర్జున్‌. ఈ చిత్రానికి ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ కాగా థియేటర్ల‌లో భారీ ఎత్తున విడుదలైంది. ఇక ఈ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే..

Karan Arjun Movie Review

క‌థ‌..

కరణ్ ఒక అనాథ‌ శరణాలయంలో పెరుగుతాడు. అతన్ని దత్తత తీసుకోవాలని అనితా చౌదరి, రఘు అనాథాశ్రమానికి వచ్చి కరణ్ ను తీసుకెళ్లే టైంలో తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ వ‌స్తుంది. దీంతో వారు వెళ్లిపోతారు. ఈ క్ర‌మంలోనే అమ్మ కోసం ఎదురు చూస్తుంటాడు కరణ్. కానీ అనితా చౌదరి రాకుండా భర్త వచ్చి కరణ్ ను తీసుకెళ్ళి బాగా చదిస్తాడు. ఆ తరువాత వృషాలితో పెళ్లి ఫిక్స్ చేయడంతో తనకి కాబోయే భార్య వృషాలి తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ ఓ వ్యక్తి వీరిద్దరినీ చంపాలని అనుకుంటాడు. అయితే వారు ఎలాగో అత‌డి బారి నుంచి త‌ప్పించుకుంటారు. త‌రువాత అర్జున్ కు తెలియకుండా అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ హెల్ప్ అడుగుతుంది వృషాలి. ఈ క్రమంలో ఆ డ్రైవర్ అర్జున్ ను కొట్టి డ్రైవర్, క్లీనర్ కలసి వృషాలిని ఎత్తుకుపోయి అత్యాచారం చేయాలి అనుకుంటారు. ఈ క్ర‌మంలో అర్జున్ వచ్చి వారి బారి నుంచి వృషాలిని కాపాడుతాడు. అయితే వారిపై దాడి చేసింది ఎవ‌రు.. వృషాలిని అర్జున్ ఎందుకు కాపాడుతాడు.. వృషాలిని క‌ర‌ణ్ పెళ్లి చేసుకోవాల‌నుకుంటే.. అర్జున్ ఎందుకు బంధిస్తాడు.. అన్న వివ‌రాలు తెలియాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

మ‌హాభారతంలో ఉండే క‌ర్ణుడు, అర్జునుడు అనే లైన్ తీసుకుని ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీ‌వ‌త్స క‌థ రాసుకున్నారు. దాన్ని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు అనుగుణంగా మార్చి తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలోనే అందులో ఆయ‌న విజ‌య‌వంతం అయ్యారు. ఒక‌రేమో అమ్మ కోసం త‌పిస్తారు. ఇంకొక‌రు అమ్మాయి కోసం ఆరాట‌ప‌డ‌తారు. దీంతో సినిమా సీన్స్ అద్భుతంగా వ‌చ్చాయి. క్లైమాక్స్ కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక హీరోయిన్ షిఫా కూడా త‌న అందం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది. త‌న పాత్ర‌కు న్యాయం చేసింద‌నే చెప్పాలి.

అలాగే తల్లి పాత్రలో నటించిన అనీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది. మిగిలిన వారంతా కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొత్తంగా చెప్పాలంటే క‌ర‌ణ్ అర్జున్ సినిమా ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM