Nayanthara Wedding Saree Cost : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. జూన్ 9న మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో వీరు వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతోపాటు సెలబ్రిటీలు భారీ సంఖ్యలో వీరి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక వీరు తమ పెళ్లి సందర్భంగా తమిళనాడు అంతటా పలు చోట్ల మొత్తం 1 లక్ష మందికి అన్నదానం కూడా చేసి గొప్ప మనసు చాటుకున్నారు.
అయితే నయనతార క్రిస్టియన్ అయినప్పటికీ భర్త హిందూ కనుక హిందూ సంప్రదాయ ప్రకారమే వివాహం జరిగింది. ఈ సందర్బంగా నయనతార ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు చీరతోపాటు పచ్చల ఆభరణాలను ధరించింది. అయితే విగ్నేష్ శివన్ కుటుంబ సంప్రదాయం ప్రకారం వధువు ఎరుపు రంగు చీరను ధరించాలట. కనుకనే నయనతార కూడా అదే చీరను ధరించింది. ఇక ఈ చీరను 15 మంది ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇందుకు గాను రూ.25 లక్షలు ఖర్చయిందట. ముంబైలో ఈ చీరను డిజైన్ చేశారు. ఇందుకు వాడిన వస్త్రాన్ని విదేశాల నుంచి తెప్పించారు.
ఇక ఈ పెళ్లిలో నయనతార పచ్చల ఆభరణాలను ఎక్కువగా ధరించింది. ఆమె ధరించిన మొత్తం ఆభరణాల విలువ రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆభరణాలను విగ్నేష్ తల్లిదండ్రులు నయనతారకు బహుమతిగా ఇచ్చారట. వాటినే ఆమె పెళ్లిలో ధరించింది. ఇక నయనతార కూడా తన భర్త విగ్నేష్‌కు పెళ్లి కానుకగా రూ.20 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని అందజేసింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…