Nayanthara : విహార‌యాత్ర‌లు, వేడుక‌లేనా.. అస‌లు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా..!

November 18, 2021 4:45 PM

Nayanthara : గత కొన్నేళ్లుగా హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ సంగతి తెలిసిందే. ఇద్ద‌రూ క‌లసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డం, క‌లసి పండుగ‌లు జ‌రుపుకోవ‌డం వంటివి చేస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. ఆ మ‌ధ్య షిర్డీతోపాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. అయితే వీరి పెళ్లి గురించి ఎప్ప‌టి నుండో ప్ర‌చారాలు న‌డుస్తున్నా దానిపై స్పందించ‌డం లేదు.

Nayanthara and vignesh shivan do they marry or not

ఇటీవ‌ల న‌య‌న‌తార.. విఘ్నేష్ శివ‌న్‌తో నిశ్చితార్థం జ‌రుపుకుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా న‌య‌న్ చెప్పింది. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారు అనుకుంటున్న స‌మ‌యంలో ఆమె జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్‌ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

2022లో విఘ్నేష్‌ – న‌య‌న్ వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు టాక్. ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార నేడు (నవంబర్‌18న) 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. అర్థర్రాతి నుంచే చెన్నైలో నయనతార బర్త్‌డే సంబరాలు షురూ అయ్యాయి. సరిగ్గా గడియారం 12 కొట్టంగానే విక్కీ నయన్‌తో కేక్ కట్‌ చేయించి క్రాకర్స్‌ పేల్చి సందడి చేశాడు.

ఈ పార్టీకి విక్కి, నయన్‌ కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. స‌మంత కూడా న‌య‌న్ బ‌ర్త్ డే పార్టీలో సంద‌డి చేసింది. ఇక విఘ్నేష్ శివ‌న్ త‌న ప్రేయ‌సిని కౌగిలిలో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక నయన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలో ఆమె పోషించిన ‘కణ్మణి’ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిని ఇన్‌స్టాలో పంచుకుని తన ప్రియురాలికి బర్త్‌డే విషెస్ చెప్పుకొచ్చాడు విఘ్నేష్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment