గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Natraj Master : బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసిన నటరాజ్ మాస్టర్..?

Natraj Master : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లలో కొరియోగ్రాఫర్ నట రాజ్ మాస్టర్ ఒకరు. నాలుగు వారాలపాటు హౌస్ లో సందడి చేసిన మాస్టర్ 4వ వారంలో ఎలిమినేట్ అయ్యి…

Natraj Master : బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసిన నటరాజ్ మాస్టర్..?

Natraj Master : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లలో కొరియోగ్రాఫర్ నట రాజ్ మాస్టర్ ఒకరు. నాలుగు వారాలపాటు హౌస్ లో సందడి చేసిన మాస్టర్ 4వ వారంలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నటరాజ్ మాస్టర్ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

Natraj Master got bumper offer from balakrishna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ మొట్టమొదటిసారిగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ పాటలో భాగంగా బాలకృష్ణకి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నటరాజ్‌ మాస్టర్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం నవంబర్ 4 నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా కుటుంబం, మంచు కుటుంబం హాజరు కాబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి