Naresh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌లకు ఇప్పటి వరకు ఉన్న పరువు కాస్తా పోయింది. నిన్న మొన్నటి వరకు వీరంటే అందరికీ గౌరవం ఉండేది. నరేష్ మా అసోసియేషన్‌లో అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు మంచు విష్ణుకు వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే అనేక సినిమాల్లోనూ నటిస్తూ గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలతో నరేష్ తన పేరు మొత్తం పోగొట్టుకున్నారు. ఆయనతో కలసి తిరిగేందుకు కూడా మా మెంబర్లు ఎవరూ ఇష్టంగా లేరని సమాచారం.
ఇక పవిత్ర లోకేష్ విషయానికి వస్తే.. ఆమె సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రల్లో నటిస్తూ అసలైన మాతృమూర్తిలా అనిపించేది. కానీ ఈ వ్యవహారం మొత్తం జరిగాక ఆమె కూడా తనపై ఉన్న గౌరవం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నుంచి ఆమెను తీసేశారు. ఇలా నరేష్, పవిత్ర లోకేష్‌లు ఇద్దరూ మీడియాకెక్కి రచ్చ రచ్చ చేశారు. అయితే వీరు ఫైనల్‌గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఏ మీడియా సంస్థకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారట. అలా చేస్తే ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుందని అనుకుంటున్నారట. కనుక మీడియాతో ఇకపై మాట్లాడొద్దని.. ఆ సంస్థలకు దూరంగా ఉండాలని వీరు డిసైడ్ అయ్యారట.
ఇక నరేష్ తన భార్య రమ్యపై చట్టపరంగా పోరాటం చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఆమెతో తెగదెంపులు చేసుకోవడమే కాకుండా.. పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకుని వీలైనంత త్వరగా ఈ వివాదాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. కనుక త్వరలోనే వీరి వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. అయితే రమ్య రఘుపతి మాత్రం నరేష్‌కు విడాకులు ఇవ్వబోనని.. తన భర్తతో కలసి ఉండేందుకు ఇప్పటికీ తాను సిద్ధమేనని.. తనను, నరేష్‌ను పవిత్ర కలవనీయకుండా అడ్డుకుంటుందని ఆరోపణలు చేసింది. మరి వీరి కథ చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…