Nani : పాత‌వ‌న్నీ బ‌య‌ట‌కు తీసి నానిని ఎందుకు తిడుతున్నారు.. బాధ‌ప‌డుతున్న ఫ్యాన్స్..

October 20, 2021 1:56 PM

Nani : నేచుర‌ల్ స్టార్ నాని మ‌న ప‌క్కింటి వ్య‌క్తిలా క‌నిపిస్తుంటారు. ఆయ‌న పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్లడు. ఇటీవ‌ల ఆయ‌న సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్న క్రమంలో నానిపై చాలా మంది ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. నోటికి వ‌చ్చిన‌ట్టు తిట్టారు. అయితే పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్ల‌ని నాని విష‌యంలో కొంద‌రు పాత విష‌యాలు బ‌య‌ట‌కు తీసి మ‌రీ ట్రోలింగ్ చేస్తున్నారు. ట‌క్ జ‌గ‌దీష్‌కి సంబంధించిన వివాదంలో నాని వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అది స‌మసిపోయింది.

Nani old tweets and posts going viral some of them trolling him

ఇక తాజాగా ఎనిమిదేళ్ల క్రితంకు చెందినవి.. అంటే.. 2013 నాటి విషయాలు బయిటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని ట్వీట్స్ ప్రో మోడీకు సంబంధించినవి, మరికొన్ని స్టేట్ బైఫ్యూరికేషన్ కు సంబంధించినవి కావటం గమనార్హం. ఆ ట్వీట్స్ ను ఇప్పుడు రీట్వీట్స్ చేస్తూ మాక్ చేస్తున్నారు. అయితే పాత ట్వీట్స్ ని ఇప్పుడు బయిటకు తీసి ఇలా ట్రోల్‌చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ నాని అభిమానులు మండిప‌డుతున్నారు.

ఇంత గ్యాప్ త‌ర్వాత చాలా అభిప్రాయాలు మారతాయి. అయినా అప్పటివి ఇప్పుడు మాటలుగా ఎలా చెప్తారు.. అంటూ మండిపడుతున్నారు. ఇక నాని చిత్రాలు విషయానికి వస్తే.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి.. సినిమాలు ఉన్నాయి. శ్యామ్ సింగ్ రాయ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా, అంటే సుందరానికి.. సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే వీటితో పాటు నాని ద‌స‌రా అనే సినిమా చేసేందుకు కూడా సిద్ద‌మ‌య్యాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now