Namitha : బేబీ బంప్ ఫొటోల‌ను షేర్ చేసిన న‌మిత‌..!

May 10, 2022 4:41 PM

Namitha : తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌టి న‌మిత ప‌రిచ‌య‌మే. ఈమె ప‌లు సినిమాల్లో న‌టించి అల‌రించింది. జెమిని, సొంతం, బిల్లా, సింహా సినిమాల‌తో న‌మిత ఆక‌ట్టుకుంది. అయితే పెళ్ల‌య్యాక ఈ అమ్మ‌డు సినిమాలు మానేసి టీవీ షోలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే న‌మిత ప్ర‌స్తుతం గ‌ర్భం ధ‌రించింది. 41 ఏళ్ల వ‌య‌స్సులో త‌ల్లి కాబోతున్న ఈమె లేటెస్ట్‌గా త‌న బేబీ బంప్ ఫొటోల‌ను షేర్ చేసింది. అవి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Namitha shared her baby bump photos
Namitha

న‌మిత త‌న బేబీ బంప్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఓ కామెంట్ కూడా పెట్టింది. తాను మాతృత్వం అనే ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాన‌ని.. తాను ఎంత‌గానో మారాన‌ని తెలియ‌జేసింది.

తాను త్వ‌ర‌లో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్లు న‌మిత తెలిపింది. ఇంత‌కు ముందు ఉన్న‌ట్లు త‌న జీవితం ఉండ‌ద‌ని.. కొత్త మార్పులు చోటు చేసుకుంటాయ‌ని.. కామెంట్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

ఇక న‌మిత 2017లో చెన్నైకి చెందిన తెలుగు వ్య‌క్తి వీరేంద్ర చౌద‌రిని వివాహం చేసుకుంది. వివాహం అనంత‌రం ఈమె సినిమాల్లో అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment