గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Namitha : పండంటి కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత..!

Namitha : సొంతం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమిత.. తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. జెమిని, సింహా తదితర సినిమాల్లో నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అయితే.. అందాల…

Namitha : పండంటి కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత..!

Namitha : సొంతం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమిత.. తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. జెమిని, సింహా తదితర సినిమాల్లో నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అయితే.. అందాల తార నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభిమానులకు శుభవార్త చెబుతున్నామంటూ.. కవల పిల్లలతో ఉన్న దృశ్యాలను దంప‌తులు షేర్ చేశారు. ఇద్దరూ మగపిల్లలేనని, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తన భర్తతో కలిసి ఆ కవలలిద్దరినీ తీసుకొని ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంది నమిత. ఆలయ ప్రాంగణంలోనే వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

Namitha blessed with baby twin boys photos viral
Namitha

చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు మగ శిశువులకు నమిత జన్మనిచ్చింది. ఆసుపత్రి యాజమాన్యానికి, గర్భం దాల్చిన నాటి నుంచి వైద్య చికిత్స, సలహాలు, సూచనలు అందించిన డాక్టర్లు భువనేశ్వరి, ఈశ్వర్, వెల్లు మురుగన్, డాక్టర్ నరేశ్‌ల‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇక ముందు కూడా అభిమానుల ఆశీస్సులు తమకు ఉండాలని ఆమె కోరింది. నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నవంబర్‌ 2017లో నమిత వివాహం చేసుకుంది. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వారి వివాహం జరిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి