Namitha : శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సొంతం మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన నమిత. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమిని, రవితేజ హీరోగా తెరకెక్కిన ఒక రాజు ఒక రాణి, శ్రీకాంత్- ప్రభుదేవాలు కలిసి నటించిన ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా.. ఐతే ఏంటి, నాయకుడు, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ టాలీవుడ్ స్టార్ గా ఎదగలేకపోయింది. దీంతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా రాణించలేకపోయింది.
తర్వాత విపరీతంగా వెయిట్ పెరగడంతో ఈమెకు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో కోలీవుడ్ యాక్టర్ వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన నమిత చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఈ బొద్దుగుమ్మ అందాల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది. 1998వ సంవత్సరంలో కేవలం 17ఏళ్ల వయస్సులో మిస్ సూరత్ కిరీటం గెలుచుకున్న నమిత.. 2001 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మూడవ స్థానంతో సరిపెట్టుకుంది.
ఆ తర్వాత ముంబైకు మకాం మార్చిన ఈ బ్యూటీ హిమానీ క్రీమ్, హ్యాండ్ సోప్, అరుణ్ ఐస్ క్రీమ్స్, మాణిక్‌చంద్ గుట్కా, నైల్ హెర్బల్ షాంపూ వంటి అనేక ఉత్పత్తులకు ప్రమోటర్‌గా చేసింది. అయితే తాజాగా నమితకు సంబంధించి ఓ డ్యాన్సింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు యాక్టర్ నందుతో కలిసి నమిత అద్భుతంగా స్టెప్పులు వేస్తోంది. ఇందులో కాస్త స్లిమ్‌గా కనిపించిన నమిత.. చెమటలు కక్కుతూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…