గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nagarjuna : సీఎం జగన్‌ను అందుకే కలిశా.. అసలు విషయం చెప్పేసిన నాగార్జున..!

Nagarjuna : గురువారం అక్కినేని నాగార్జున ఉన్న‌ట్టుండి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షం అయ్యారు. స‌డెన్‌గా అటు ఎందుకు వెళ్లారా.. అని అంద‌రూ ఆలోచిస్తున్న స‌మ‌యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్‌ను కలిశారు. వీరి సమావేశం…

Nagarjuna : సీఎం జగన్‌ను అందుకే కలిశా.. అసలు విషయం చెప్పేసిన నాగార్జున..!

Nagarjuna : గురువారం అక్కినేని నాగార్జున ఉన్న‌ట్టుండి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షం అయ్యారు. స‌డెన్‌గా అటు ఎందుకు వెళ్లారా.. అని అంద‌రూ ఆలోచిస్తున్న స‌మ‌యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్‌ను కలిశారు. వీరి సమావేశం దాదాపు గంటపాటు జరిగింది. వీరి సమావేశం అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.

Nagarjuna told why he met cm ys jagan

‘విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా రోజులవుతోంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్‌తో కలిసి లంచ్ చేశాను. ఇది నా వ్యక్తిగత పర్యటన. ఇండస్ట్రీ గురించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని నాగార్జున తెలిపారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వ‌చ్చారు నాగ్.

సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై నాగార్జు, జ‌గ‌న్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రాలేదు. కానీ.. నాగార్జున మాత్రం ఎలాంటి ఇతర అంశాలపై చర్చించలేదని, వ్యక్తిగతంగానే సీఎంను కలిసినట్లు మీడియాకు స్పష్టం చేశారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు.

నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్ర‌స్తుతం చైతూతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు చిత్రం చేస్తున్నారు. ఇందులో నాగ్ సరసన రమ్య కృష్ణ, చైతూకి జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. మరో వైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే సినీ రంగానికి చెందిన అంశాలపై మాట్లాడాల్సి వస్తే కేవలం నాగ్‌ ఇద్దరు నిర్మాతలను వెంట బెట్టుకుని వెళ్లరు కదా.. కనుక నాగ్‌ చెప్పినట్లు వ్యక్తిగత విషయాలను చర్చించేందుకే సీఎం జగన్‌ను ఆయన కలిసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నాగార్జున సడెన్‌గా సీఎం జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి