Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మరోవైపు తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను అన్న అక్కినేని వెంకట్ తో కలిసి చూసుకుంటున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ కి ఒక బ్రాండ్ ఉంది. ఆ సంస్థ నుంచి ఎప్పుడూ కొత్త టాలెంట్ బయటకు వస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయంలో నాగార్జున ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటాడు. ఫేడ్ అవుట్ అవుతున్న రమ్యకృష్ణ లాంటి వారికి అవకాశం ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి తెచ్చాడు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాల్లో నాగ్ తన హిట్ పెయిర్ అయిన రమ్యకృష్ణను ఎంచుకున్న సంగతి తెలిసిందే.
నాగార్జున సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నవారే తప్ప.. దెబ్బైపోయిన వాళ్ళు చాలా తక్కువ. కానీ దెబ్బైపోయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రకుల్‌కి వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. బిజీ హీరోయిన్‌గా ఉన్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలో ఛాన్స్ వస్తే డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అలాంటి రకుల్ ఇప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఏ హీరో పిలిచి తన సరసన ఛాన్స్ ఇస్తాడా.. అని పర్సనల్‌గా కాంటాక్ట్ చేస్తోందట.
ఇటీవల ఎక్కువగా గీతా ఆర్ట్స్ వారితో టచ్‌లో ఉంటుందని టాక్. అంతేకాదు, అల్లు అర్జున్ కి మెసేజ్‌లు పెడుతుందని చెప్పుకుంటున్నారు. తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని కూడా ఇన్‌డైరెక్ట్‌గా కోరిందని సమాచారం. ఇదిలా ఉండగా నాగార్జున మళ్ళీ రకుల్‌ని పిలిచినట్టు తెలుస్తోంది. ఇంతకముందు నాగార్జున సరసన రకుల్ మన్మథుడు 2లో హీరోయిన్‌గా నటించింది. రకుల్ టాలీవుడ్‌లో కెరీర్ దెబ్బతినడానికి ఈ సినిమా కారణమని చెప్పొచ్చు. ఆ సినిమాలో ముసలి వయస్సులో ఉన్న నాగ్‌తో లిప్ లాక్ ఇవ్వడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు.
ఇటీవల క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలంలో హీరోయిన్ గా చేసింది రకుల్. ఇందులో రకుల్ డీగ్లామర్ గా కనిపించింది. ఇది కూడా రకుల్ కెరీర్ లో ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఆమెతో చేసేందుకు కుర్ర హీరోలు ఇష్టపడలేదు. అయితే తన వల్ల కెరీర్ దెబ్బైపోయింది కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చి రకుల్‌ను ఆదుకోవాలనుకుంటున్నారట నాగార్జున. మరి అది ఏ సినిమానో తెలియదు గానీ, రకుల్ మాత్రం మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఫిట్ నెస్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే రకుల్ కి మళ్లీ అవకాశం వస్తే హిట్ ట్రాక్ లో పడుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…