Naga Chaitanya : డీజే టిల్లులా అలరించబోతున్న నాగచైతన్య..?

Naga Chaitanya : లవ్‌ స్టోరీ, బంగార్రాజు చిత్రాల విజయాలతో నాగచైతన్య మంచి జోరు మీద ఉన్నాడు. ఈయన నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా అనే హిందీ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇక మనం దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కించిన థాంక్‌ యూ మూవీ ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది. అయితే ప్రస్తుతం చైతూ ఇంకో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. డీజే టిల్లు దర్శకుడు విమల్‌ కృష్ణ చెప్పిన స్టోరీ చైతూకు బాగా నచ్చిందట. దీంతో ఆ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈమూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. బంపర్‌ హిట్‌ అయింది. మూవీకి చెందిన టీజర్‌, ట్రైలర్‌ చూసి ఇందులో ఆ తరహా సీన్లు ఉంటాయని అనుకున్నారు. కానీ అలా కాకుండా కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రం సాగింది. ముఖ్యంగా ఇందులో డీజే టిల్లు పాత్ర చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ డైలాగ్స్‌పై ఇప్పటికీ మీమ్స్‌ చేస్తూనే ఉన్నారు.

Naga Chaitanya

అయితే డీజే టిల్లులో సిద్ధు పాత్రను డిజైన్‌ చేసినట్లుగానే చైతన్యతో తీయబోయే మూవీలో విమల్‌ కృష్ణ చైతూ పాత్రను కూడా అలాగే డిజైన్‌ చేయనున్నారట. ఊర మాస్‌ క్యారెక్టర్‌తో.. తెలంగాణ యాసతో చైతూ క్యారెక్టర్‌ ఉంటుందట. ఇక డీజే టిల్లుకు భిన్నంగా స్టోరీ ఉంటుందని.. కానీ చైతూ క్యారెక్టర్‌ మాత్రం డీజే టిల్లును తలపిస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక చైతన్య ప్రస్తుతం సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వాస్తవానికి సర్కారు వారి పాట కన్నా ముందే చైతన్యతో పరశురామ్‌ మూవీ చేయాల్సి ఉంది. కానీ మహేష్‌ సినిమా కావడంతో ముందుగా దాన్ని కంప్లీట్‌ చేశారు. ఇక ఇప్పుడు చైతూను పరశురామ్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ మూవీ అయ్యాకే.. విమల్‌ కృష్ణతో మూవీ ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM