Naga Chaitanya : సమంత, నాగచైతన్య.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత ఇద్దరూ సినిమాల్లో బిజీ అయ్యారు. ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సమంత పుష్ప ఐటమ్ సాంగ్‌తో మెరవగా.. చైతన్య శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ తీసి హిట్ కొట్టాడు. అలాగే తాజాగా బంగార్రాజు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు థాంక్ యూ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా నాగచైతన్య బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. నటుడు అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా అనే మూవీలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగచైతన్య ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్‌లో చైతూ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
భారీ బడ్జెట్‌తో అమెజాన్ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చైతన్య జర్నలిస్టు పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో చైతన్య పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర చేయబోతున్నాడట. ఈ క్రమంలోనే ఇందుకు గాను చైతన్య తన మేకోవర్‌ను కూడా పూర్తిగా మార్చుకోనున్నాడని తెలుస్తోంది. మొత్తం 3 సీజన్లుగా ఈ సిరీస్‌ను తీయనున్నారని తెలుస్తోంది. ఒక సీజన్‌కు సుమారుగా 8 నుంచి 10 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించి అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…