గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mrunal Thakur : బాహుబలిని మిస్ చేసుకున్న సీతారామం హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Mrunal Thakur : మృణాల్‌ ఠాకుర్‌.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా…

Mrunal Thakur : బాహుబలిని మిస్ చేసుకున్న సీతారామం హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Mrunal Thakur : మృణాల్‌ ఠాకుర్‌.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి తెలుగు చిత్రంతోనే మృణాల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  తనదైన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్‌లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా నిజానికి మృణాల్ ఠాకూర్ ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాలలో నటించాల్సి ఉండగా ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ ను మృణాల్ మిస్ చేసుకుంది. 2015 లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. హీరో ప్రభాస్ మరియు డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ బహుబలి చిత్రంతో వంద‌ రెట్లు పెరిగిపోయింది.

Mrunal Thakur missed baahubali movie know the reason
Mrunal Thakur

అయితే ఈ సినిమాలో మృణాల్ చాన్స్ మిస్ చేసుకుంది హీరోయిన్ గా కాదు. సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో నటించే ఛాన్స్ ను మృణాల్ కోల్పోయింది. జక్కన్న బాహుబలి సినిమా కోసం ముంబైలో కూడా ఆడిషన్స్ నిర్వహించారట. ఆ ఆడిషన్స్ లో మృణాల్ ను ఎంపిక చేశారట. కానీ ఆ తరవాత ఏమైందో తెలియదు గానీ రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా ఫైనల్ గా శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేయడం జరిగిందట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి