OTT : ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..!

OTT : వారం మారే కొద్దీ కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతి వారం ప్రేక్షకులు కూడా కొత్త మూవీలు, సిరీస్‌లు ఏవి రిలీజ్‌ అవుతున్నాయి.. అని ఆరా తీస్తున్నారు. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను పలు మూవీలు అలరించనున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెల 25వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో టూల్‌సిడాస్‌ జూనియర్‌ అనే హిందీ మూవీ స్ట్రీమ్‌ కానుంది. డ్రామా జోనర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే మే25న యూట్యూబ్‌లో ది మినియేచరిస్ట్‌ ఆఫ్‌ జునాగఢ్‌ అనే మూవీ స్ట్రీమ్‌ కానుంది. డ్రామా కథాంశంగా రూపొందిన ఈ మూవీ హిందీలో అందుబాటులోకి రానుంది. ఇక విశ్వక్‌సేన్, రుక్సార్‌ ధిల్లాన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ కూడా ఈ వారంలోనే స్ట్రీమ్‌ కానుంది. ఆహా సంస్థ ఈ మూవీ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఆహా యాప్‌లో ఈ నెల 27వ తేదీన అశోకవనంలో మూవీని స్ట్రీమ్‌ చేయనున్నారు. కామెడీ, రొమాన్స్‌ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.

OTT

ఇక ఈ నెల 27వ తేదీన జీ5 యాప్‌లో అటాక్‌ అనే హిందీ మూవీ స్ట్రీమ్‌ కానుంది. ఇందులో జాన్‌ అబ్రహాం, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు నటించారు. యాక్షన్‌, సైన్స్‌ ఫిక్షన్‌, థ్రిల్లర్‌ జోనర్‌లలో ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే 27వ తేదీన డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ లో కాతువాకుల రెండు కాదల్‌ మూవీ స్ట్రీమ్‌ కానుంది. తమిళంలో రూపొందిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, నయనతార, సమంతలు హీరో హీరోయిన్లుగా నటించారు. కామెడీ, డ్రామా, రొమాన్స్‌ కథాంశంతో ఈ మూవీని నిర్మించారు.

కాగా ఈ నెల 27వ తేదీన అమెజాన్‌లో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2ను రిలీజ్‌ చేయనున్నారు. పే పర్‌ వ్యూ పద్ధతిలో రూ.199 చెల్లించి ఈ మూవీని చూడవచ్చు. కన్నడ, తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ఈ మూవీ లభ్యం కానుంది.

ఈ నెల 27వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రేంజర్‌ థింగ్స్‌ సిరీస్‌ సీజన్‌ 4 స్ట్రీమ్‌ కానుంది. ఇంగ్లిష్ భాషలో రూపొందించబడిన ఈ సిరీస్‌ను డ్రామా, మిస్టరీ, సైఫై ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఆహాలో మే 29వ తేదీ నుంచి పయనింగల్‌ గవనిక్కవుమ్‌ అనే తమిళ మూవీ స్ట్రీమ్‌ కానుంది. డ్రామా, కామెడీ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM