OTT : వారం వారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఓటీటీల్లో సినిమాలు సందడి చేస్తున్నాయి. దీంతో వారం మారిన తరువాత ఈ వారం కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయి.. అని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఓటీటీ యాప్‌లు కూడా కొత్త సినిమాలను రిలీజ్ చేయడంలో పోటీలు పడుతున్నాయి. ఇప్పటికే అనేక కొత్త సినిమాలు ఈ యాప్‌లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పలు కొత్త మూవీలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. అలాగే కొన్ని సిరీస్‌లను కూడా లాంచ్ చేయనున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, సిరీస్ ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షోకు మంచి పేరుంది. గతంలోఈ షోకు రేటింగ్స్ బాగా వచ్చాయి. కనుక ఈ షోను ఎప్పటి నుంచో కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇదే షోకు చెందిన 7వ సీజన్ ఈ వారం నుంచే స్ట్రీమ్ కానుంది. దీన్ని జూలై 7వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ షోను వీక్షించవచ్చు. ఈసారి సీజన్‌లో ఓ ఎపిసోడ్‌లో సమంత పాల్గొంది. ఈ క్రమంలోనే ఆమె ఏ ఎపిసోడ్‌లో ఉంది.. అసలు ఆమె ఏం మాట్లాడింది.. అన్న వివరాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈమెతోపాటు అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, సారా అలీ ఖాన్ వంటి వారు కూడా ఈ సారి సీజన్‌లో గెస్ట్‌లుగా రానున్నారు. దీంతో ఈ సీజన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
మళయాళంలో తెరకెక్కిన పకా రివర్ ఆఫ్ బ్లడ్ అనే మూవీని సోనీ లివ్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీన్ని జూలై 7 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. అలాగే జూలై 8 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో బూ, బిచ్ అనే టీవీ షోను ప్రసారం చేయనున్నారు. కామెడీ, సైఫై, ఫాంటసీ జోనర్‌లలో దీన్ని తెరకెక్కించారు. జూలై 8వ తేదీనే కుంజెల్దో అనే మళయాళం సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ కామెడీ మూవీని జీ5 యాప్‌లో చూడవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 8వ తేదీన మోడ్రన్ లవ్: హైదరాబాద్ అనే సిరీస్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. అలాగే బేర్ గ్రిల్స్, రణ్‌వీర్ లు కలిసి చేసిన ప్రత్యేక ఎపిసోడ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంటుంది. జూలై 8న ఈ ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేస్తారు.
కమలహాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన విక్రమ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ఈ మూవీని జూలై 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. నాని, నజ్రియా నటించిన అంటే సుందరానికీ.. మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 10వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇలా పలు మూవీలు, సిరీస్‌లు ఈ వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…