Moto G71 5G : త‌క్కువ ధ‌ర‌కే మోటోరోలా కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదుర్స్‌..

Moto G71 5G : ప్ర‌స్తుతం వినియోగ‌దారులు మార్కెట్‌లో 5జి ఫీచ‌ర్ ఉన్న ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని ఎక్కువ‌గా చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా 5జి ఫీచ‌ర్ ఉన్న ఫోన్ల‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే అందించేందుకు పోటీ ప‌డుతున్నాయి. ఇక తాజాగా మోటోరోలా కంపెనీ ఇదే కోవ‌లో ఓ 5జి ఫోన్‌ను లాంచ్ చేసి త‌క్కువ ధ‌ర‌కే అందిస్తోంది.

మోటోరోలా సంస్థ మోటో జి71 5జి పేరిట ఓ నూత‌న 5జి స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. దీని వ‌ల్ల 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది. అలాగే 6జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. అవ‌స‌రం అనుకుంటే మ‌రో 2జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను పెంచుకోవ‌చ్చు.

ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ 12కు అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌కు వెనుక‌వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అలాగే 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాను కూడా వెనుక వైపు ఇచ్చారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఇందులో డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను కూడా ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్ చార్జింగ్ 20 నిమిషాల్లో 50 శాతం, ఒక గంట‌లో 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది.

మోటో జి71 5జి ఫోన్ నెప్‌ట్యూన్ గ్రీన్‌, ఆర్కిటిక్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్ ధర రూ.18,999గా ఉంది. జ‌న‌వ‌రి 19వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM