Mohan Babu : గత కొద్ది రోజులుగా మోహన్ బాబు వార్తలలో తెగ నానుతూ వస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో అంతా తానై ముందుకు నడిచాడు. విష్ణుకి సపోర్ట్‌గా ఉంటూ ఎలక్షన్స్ రక్తి కట్టేలా చేశాడు. మంచు విష్ణు గెలుపులో తాను సగ భాగం అయ్యాడు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓ సందర్భంలో శివ బాలాజీ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా ? అని ఆశ్చర్యపోయానని.. మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శివ బాలాజీ భార్య, నటి మధుమిత కాస్త హడావిడి చేసింది.
మోహన్ బాబు ప్రసంగిస్తుంటే.. మధ్యలో అటూ ఇటూ కదిలింది. దీంతో కోపోద్రిక్తుడైన మోహన్ బాబు.. ఏయ్.. అలా అటూ ఇటూ కదలొద్దు.. ఒకరు ప్రసంగం ఇస్తుంటే అలా కదిలితే.. శ్రద్ద దెబ్బ తింటుంది.. అలా చేయకు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మధుమితపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…