Minister Anil Kumar Yadav : తెలంగాణలో తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ఏపీలోనూ తమ పార్టీ పెట్టాలని ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఆ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. ఏపీలోనూ తెరాస పార్టీ పెట్టాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో కరెంటు సమస్య లేదని అన్నారు. ఏపీలో పార్టీ పెడితే చాలు, గెలిపించుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏపీలోనూ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకనే తెరాసను వారు ఆహ్వానిస్తున్నారని అన్నారు.
అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో కరెంటు కొరత సమస్య లేదని, కేవలం బొగ్గు కొరత మాత్రమే ఉందని, ఇది దేశమంతటా ఉందన్నారు. నిజానికి తెలంగాణ కన్నా ఏపీలోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలవుతున్నాయని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ కావలిస్తే ఏపీలో తమ పార్టీ పెట్టుకోవచ్చని.. దాన్ని అడ్డుకోబోమని.. స్వాగతిస్తామని తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…