Microsoft Surface Go 3 : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్.. సర్ఫేస్ సిరీస్‌లో ఓ నూతన ట్యాబ్‌ను తాజాగా లాంచ్ చేసింది. సర్ఫేస్ గో 3 పేరిట ఆ ట్యాబ్ విడుదలైంది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో 10.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఈ ట్యాబ్‌లో డ్యుయల్ కోర్ ఇంటెల్ పెంటియమ్ గోల్డ్ 6500వై ప్రాసెసర్ లభిస్తుంది. డ్యుయల్ కోర్ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-10100వై ప్రాసెసర్‌తో ఇంకో వేరియెంట్‌ను కూడా అందిస్తున్నారు. ఇంటెల్ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్ లభిస్తాయి. 4/8 జీబీ ర్యామ్ ఆప్షన్‌లలో ఈ ట్యాబ్‌ను అందిస్తున్నారు.
ఈ ట్యాబ్‌ను 2-ఇన్-1 గా ఉపయోగించుకోవచ్చు. అంటే కీబోర్డును ఫిక్స్ చేసి పీసీలా వాడుకోవచ్చు. లేదా ట్యాబ్‌లాగే ఉపయోగించుకోవచ్చు. ఇందులో 64జీబీ ఈఎంఎంసీ డ్రైవ్ లభిస్తుంది. 128 జీబీ ఎస్ఎస్‌డీ డ్రైవ్‌ను అందిస్తున్నారు. వైఫై ఆప్షన్ ఉంది. 11 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
ఈ ట్యాబ్‌లో ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే ముందు వైపు 5 మెగాపిక్సల్, వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. డాల్బీ ఆడియో, వైఫై 6, బ్లూటూత్ 5.0.. ఫీచర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 ప్రారంభ ధర రూ.42,999 ఉండగా.. పలు వేరియెంట్లు ఇందులో లభిస్తున్నాయి. గరిష్ట వేరియెంట్ ధర రూ.62,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను నవంబర్ 23 లోగా ప్రీ ఆర్డర్ చేస్తే రూ.9,099 విలువైన సర్ఫేస్ పెన్‌ను ఉచితంగా అందిస్తారు. డిసెంబర్ నెల నుంచి ఆథరైజ్డ్ డీలర్స్ వద్ద ఈ ట్యాబ్ లభిస్తుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…