Movies : ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఈ రోజు పండుగే.. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..?

Movies : ఓటీటీల్లో సినిమాల‌ను చూసే ప్రేక్ష‌కుల‌కు నిజంగా ఈ శుక్ర‌వారం పండుగే అని చెప్ప‌వ‌చ్చు. ఈ రోజు ఏకంగా 3 భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో రాగా.. ఒక సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. గ‌తంలో ఈ విధంగా మూడు భారీ సినిమాలు ఒకే రోజు ఓటీటీల‌లో వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. ఇక ఈ రోజు (మే 20, 2022) ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇంకా అనేక థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతూనే ఉంది. ఇక మే 20వ తేదీ నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జీ5లో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు.

Movies

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య మూవీ నిరాశ ప‌రిచింది. అయితే ఈ మూవీ శుక్ర‌వారం ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని వీక్షించ‌వ‌చ్చు. ఇక మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన 12th Man అనే మూవీ కూడా ఈ రోజే రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే వ‌స్తోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ మూవీని కూడా శుక్ర‌వార‌మే రిలీజ్ చేస్తున్నారు. మిస్టరీ, థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఇక శ్రీ విష్ణు హీరోగా న‌టించిన భ‌ళా తంద‌నాన సినిమా మే 6న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కూడా శుక్ర‌వార‌మే ఓటీటీల్లో రిలీజ్ అవుతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ మూవీని వీక్షించ‌వ‌చ్చు.

ఇక ఇవే కాకుండా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఇదే రోజు నుంచి ఎస్కేపీ లైవ్ అనే హిందీ వెబ్ సిరీస్‌ను ప్ర‌సారం చేస్తున్నారు. జీ5లో జాంబివిలి అనే మ‌రాఠీ మూవీ స్ట్రీమ్ అవుతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో చిప్ ఎన్ డేల్ : రెస్‌క్యూ రేంజ‌ర్స్ అనే ఇంగ్లిష్ మూవీ స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో పంచాయ‌త్ అనే హిందీ సిరీస్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో మై నెక్ట్స్ గెస్ట్ నీడ్స్ నో ఇంట్ర‌డ‌క్ష‌న్ అనే ఇంగ్లిష్ చాట్ షోను ప్ర‌సారం చేస్తున్నారు.

ఇక నెట్ ఫ్లిక్స్‌లోనే ల‌వ్ డెత్ + రోబోట్స్ అనే సిరీస్‌కు చెందిన 3వ సీజ‌న్ శుక్ర‌వారం నుంచి స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నైట్ స్కై సీజ‌న్ 1 ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇలా మే 20వ తేదీన ప‌లు సినిమాలు, సిరీస్ ల‌తో ఓటీటీల‌లో నిజంగా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఇంకో వారం ప‌ది రోజుల వ‌ర‌కు కావ‌ల్సినంత వినోదం ల‌భించనుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM