గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mangli : యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న మంగ్లీ బొడ్రాయి సాంగ్..!

Mangli : సింగర్ గా మంగ్లీ గురించి అందరికీ తెలిసిందే. స్పెషల్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె పాడిన రాములో…

Mangli : యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న మంగ్లీ బొడ్రాయి సాంగ్..!

Mangli : సింగర్ గా మంగ్లీ గురించి అందరికీ తెలిసిందే. స్పెషల్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె పాడిన రాములో రాముల, సారంగదరియా పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేశాయి. ఇక తాజాగా మంగ్లీ పాడిన పాట యూట్యూబ్‌లో రికార్డులను సృష్టిస్తోంది.

Mangli bodrayi song viral in social media

కుంచం శంక‌ర్  దర్శకత్వంలో అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై  సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చిల్ బ్రో. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన ఒక పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో మంగ్లీ పాడిన బొడ్రాయి అనే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సంగీతం ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు.

మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేసిన ఈ చిత్రంలోని ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మంగ్లీ అద్భుతమైన గాత్రంతో పాడిన ఈ పాటను వినండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి