Mangli : సెల్ఫీ అడిగిన ఫ్యాన్స్‌.. ఫోన్‌ పగలగొట్టు అన్న మంగ్లీ..

December 28, 2021 2:31 PM

Mangli : ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల‌కు సెల్ఫీల సెగ ఎక్కువైంది. ఎక్క‌డ‌కు వెళ్లినా సెల్ఫీలంటూ నానా ర‌చ్చ చేస్తున్నారు. చిన్న హీరోల‌తోపాటు స్టార్ హీరోల‌కు ఇదే ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా మంగ్లీకి అభిమానుల తాకిడి ఎక్కువ కాగా, ఒక్క‌సారిగా ఆమె ఆగ్ర‌హం క‌ట్టలు తెంచుకుంది. మంత్రి కుమార్తె పెళ్లి రెసెప్షన్‌కు వచ్చిన మంగ్లీతో సెల్పీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడడంతో ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

fan asked selfie for Mangli she said break the phone

వీడియాలో మంగ్లీ ఫోన్‌లు పగలగొట్టు అంటూ తన స్టాఫ్‌కు చెబుతూ చిందులు తొక్కింది. ఇక తన అసిస్టెంట్‌ను మంగ్లీ కొట్టినట్టు కూడా కనిపిస్తోంది. బండికి ఫోన్ చేయ్ రా దరిద్రుడా అంటూ అరిచేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి మంగ్లీ పేరు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

మంగ్లీ సింగ‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏ పాట పాడినా కూడా మంగ్లీ మార్క్ ఉండాల్సిందే. అది జానపదం అయినా భక్తి గీతమైనా ఐటం సాంగ్ అయినా కూడా మంగ్లీ పాడితే దాని స్థాయి వేరేలా ఉంటుంది. మంగ్లీ పాడిన పాటలు కూడా వివాదాలకు దారి తీస్తుంటాయి. ఆ మధ్య మంగ్లీ పాడిన ఓ భక్తి పాట మీద నెట్టింట్లో చర్చలు జరిగాయి. ఊ అంటావా మావ సాంగ్‌ని మంగ్లీ క‌న్న‌డ‌లో పాడ‌గా, తెలుగులో ఆమె చెల్లి ఇంద్రావ‌తి ఆల‌పించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment