గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Manchu Lakshmi : మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నిక‌వ‌డంపై.. మంచు ల‌క్ష్మి రియాక్ష‌న్ ఇదీ..!

Manchu Lakshmi : కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠ‌గా కొన‌సాగిన మా ఎన్నిక‌లు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్ర‌కాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో విష్ణు విజ‌యం సాధించారు. అయితే ముందు నుంచీ చాలా…

Manchu Lakshmi : మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నిక‌వ‌డంపై.. మంచు ల‌క్ష్మి రియాక్ష‌న్ ఇదీ..!

Manchu Lakshmi : కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠ‌గా కొన‌సాగిన మా ఎన్నిక‌లు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్ర‌కాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో విష్ణు విజ‌యం సాధించారు. అయితే ముందు నుంచీ చాలా మంది మంచు విష్ణునే ప్రెసిడెంట్ అవుతాడ‌ని చెప్పారు. అలా చెప్పిన‌ట్లుగానే జ‌రిగింది. ఇక ఆయ‌న విజ‌యంపై సెల‌బ్రిటీలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తూ.. శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Manchu Lakshmi responded over his brothers win

మంచు విష్ణు విజ‌యంపై ఆయ‌న సోద‌రి మంచు ల‌క్ష్మి స్పందించారు. నా త‌మ్ముడా మ‌జాకా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. నిజానికి మంచు విష్ణు పోటీలో నిల‌బ‌డ్డాక మంచు ల‌క్ష్మి కూడా త‌న వంతుగా క్యాంపెయినింగ్ చేశారు. ఇక మంచు విష్ణు గెలిచాక ఆమె ప‌ట్ట‌రానంత సంతోషంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్ ఓట‌మిని జీర్ణించుకోలేని నాగ‌బాబు మా మెంబ‌ర్‌షిప్‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న అన్న మెగాస్టార్ చిరంజీవి ముందు రోజు రాత్రి అంద‌రం క‌ల‌సి క‌ట్టుగా ఉందామ‌ని చెప్పినా కూడా.. ఇంకా నాగ‌బాబు ఆ వ్య‌థ నుంచి బ‌య‌ట‌కు రాన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి