Mahesh Babu : మ‌హేష్ బాబు చేసిన ప‌నికి తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్‌..!

January 5, 2022 12:18 PM

Mahesh Babu : సోష‌ల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్‌కు మ‌ధ్య ఉండే త‌గ‌వు మామూలే. త‌మ హీరో గొప్ప అంటే త‌మ హీరోనే గొప్ప‌.. అని ఫ్యాన్స్ ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే త‌మ హీరోల సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతారు. ఇక అవ‌తలి హీరోల ఫ్యాన్స్ మాత్రం విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇది ష‌రా మామూలే. కానీ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేసిన ప‌నికి ఆయ‌న ఫ్యాన్స్ తీవ్రంగా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే..

Mahesh Babu praised pushpa movie fans not happy with it

జ‌న‌వ‌రి 2020లో మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లు అర్జున్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించాయి. అయితే అల వైకుంఠ‌పుర‌ములో మూవీ మాత్రం క‌లెక్ష‌న్ల ప‌రంగా కొంచెం పైచేయి సాధించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్ప‌ట్లో మ‌హేష్ పై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు.

అలా ఇరు హీరోల‌కు చెందిన ఫ్యాన్స్ మ‌ధ్య అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవ‌ల అల్లు అర్జున్ పుష్ప మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్లు బాగానే వ‌చ్చాయి. దీంతో ఆ చిత్ర యూనిట్ స‌క్సెస్ మీట్‌లు నిర్వ‌హించింది. అయితే అవ‌న్నీ ఉత్త మాట‌లేన‌ని, బోగ‌స్ క‌లెక్ష‌న్లు అని చెబుతూ మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇక ఇటీవ‌లే మ‌హేష్ విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చి పుష్ప సినిమా చూశారు. దీంతో ఆ మూవీ బాగుంద‌ని కితాబిచ్చారు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ చేసిన కామెంట్స్‌కు ఆయ‌న ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాము ఒక‌వైపు మ‌హేష్ కోసం సోష‌ల్ మీడియాలో పోరాటం చేస్తుంటే.. ఆయ‌న ఇలా అల్లు అర్జున్ మూవీ బాగుంద‌ని చెప్ప‌డం.. త‌మ‌కు ఎంత మాత్రం న‌చ్చ‌డం లేద‌ని అంటున్నారు. అయితే చివ‌ర‌కు ఈవిష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now