Mahesh Babu : బాలుడికి పున‌ర్జ‌న్మ ఇచ్చిన మ‌హేష్ బాబు.. మీ స‌హాయానికి శాల్యూట్‌..!

June 19, 2022 5:14 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌రోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి ఆయ‌న పున‌ర్జ‌న్మ ఇచ్చారు. శ్రీ‌మంతుడు సినిమాలో ఆయ‌న ఓ గ్రామాన్నే ద‌త్త‌త తీసుకుని స‌మాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక రియ‌ల్ లైఫ్‌లోనూ ఆయ‌న ఇలాగే హీరో అనిపించుకుంటున్నారు. చిన్నారుల గుండె ఆప‌రేష‌న్ల‌కు అయ్యే ఖ‌ర్చును ఆయ‌న త‌న ఫౌండేష‌న్ ద్వారా భరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయ‌న త‌న ఫౌండేష‌న్ ద్వారా తాజాగా ఓ బాలుడి శస్త్ర చికిత్స‌కు అయ్యే స‌హాయం చేశారు. దీంతో బాలుడు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ఆయ‌న భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్‌లు త‌మ మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ ద్వారా పేద చిన్నారుల‌కు ఉచితంగా గుండె ఆప‌రేష‌న్ల‌ను చేయిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వీరికి రెయిన్‌బో చిల్డ్ర‌న్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కూడా స‌హ‌కారం అందిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఓ 14 నెల‌ల బాలుడికి గుండెకు శ‌స్త్ర చికిత్స చేయాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు బాలుడు ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో వెంట‌నే స్పందించిన మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ ఆ బాలుడి శ‌స్త్ర చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రించేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో రెయిన్‌బో హాస్పిట‌ల్ వైద్యులు ఆ బాలుడికి ఆప‌రేష‌న్ చేశారు. అది విజ‌య‌వంతం అయింది. ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. క్షేమంగా చికిత్స పొందుతున్నాడు. ఇదంతా మ‌హేష్ చ‌ల‌వే అని ఆయ‌న‌ను కొనియాడుతున్నారు.

Mahesh Babu helped a poor boy for his heart surgery
Mahesh Babu

ఇక మ‌హేష్ బాబు త‌న ఫౌండేష‌న్ ద్వారా పేద చిన్నారికి ఇలా స‌హాయం అందించ‌డంతో అంద‌రూ ఆయ‌న‌ను అభినందిస్తున్నారు. ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు. త‌మ అభిమాన హీరో చేస్తున్న ప‌నుల‌కు వారు పొంగిపోతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట ఇటీవ‌లే విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న నెక్ట్స్ సినిమాను త్రివిక్ర‌మ్‌తో చేయ‌నున్నారు. ఇందులో పూజా హెగ్డె హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ త‌రువాత వ‌చ్చే ఏడాది నుంచి రాజ‌మౌళితో సినిమా ప్రారంభం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment