గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట స్టోరీ అదేనా ? ఆందోళ‌న చెందుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌..!

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. సర్కారు వారి పాట చిత్రం త‌ర్వాత త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడు. అయితే స‌ర్కారు వారి పాట విష‌యానికి వ‌స్తే…

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట స్టోరీ అదేనా ?  ఆందోళ‌న చెందుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌..!

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. సర్కారు వారి పాట చిత్రం త‌ర్వాత త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడు. అయితే స‌ర్కారు వారి పాట విష‌యానికి వ‌స్తే మహేశ్ బాబు ఈ సినిమాలో ఎంత ఎనర్జిటిక్ గా, రొమాంటిక్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ చూస్తే అర్థమైపోతోంది. మరోవైపు అభిమానులను, మాస్ ఆడియెన్స్ ను ఖుషి చేసేందుకు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా తెరకెక్కించారంట పరుశురామ్.

Mahesh Babu fans worry about Sarkaru Vaari Paata story news
Sarkaru Vaari Paata

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 133 మిలియన్ వ్యూస్ ను రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట మినహా షూటింగ్ పూర్తైయినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్‌తో వస్తోందని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మహేష్ వడ్డీ రికవరీ ఏజెంట్ అజయ్‌గా నటించాడని, అక్కడ ఒక పెద్ద సమస్యను పరిష్కరించడానికి తన గ్రామానికి తిరిగి వెళ్తాడని కొన్ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ చిత్రం కూడా మ‌హ‌ర్షి మాదిరిగా మ‌రో మెసేజ్ ఓరియెంటెడ్ అవుతుందా అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అతనిని కమర్షియల్ హీరో పాత్రలో చూడాలని ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌ని నిరుత్సాహ‌ప‌రుస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి