OTT : వారం వారం మారుతున్న కొద్దీ ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగానే అలవాటు పడ్డారు. దీంతో ఓటీటీ యాప్స్ వీలైనంత త్వరగా కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రౌడీ హీరో విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం.. హైవే. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 19వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.
కొత్త సినిమాలను విడుదలైన రోజే రిలీజ్ చేస్తున్న తమిళ రాకర్స్ అనే సైట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇదే కథాంశం, ఇదే పేరుతో ఓ మూవీని తెరకెక్కించారు. తమిళ రాకర్జ్ పేరిట రూపొందిన ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సోనీ లివ్ యాప్‌లో ఈ మూవీని ఈనెల 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సినిమాల పైరసీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
విజయ్ ఆంటోని నటించిన యానాయ్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీని ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. జీ5 యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్, ధనంజయలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. బైరాగి. ఈ మూవీని ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీ వూట్ అనే యాప్‌లో స్ట్రీమ్ కానుంది. ఇలా ఈ వారం పలు మూవీలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…