Kondapolam : ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ అద్భుతంగా నటించాడు. అందరి ప్రశంసలను ఈ మూవీ దక్కించుకుంది. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. కొండపొలం. దీన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తోంది. అయితే ఈ మూవీ తాజాగా వివాదంలో ఇరుక్కుంది.
ఈ మూవీలో హీరో పేరుకు చివర యాదవ్ అని ఉంటుంది. దీనిపైనే వివాదం నెలకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పాలమూరు కురవ సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరోళ్ల రవి కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో హీరో పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొండపొలం సినిమాలో తమ కురుమ / కురువ కులవృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను బాగా చూపించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందని అన్నారు. అయితే ఈ సినిమాలో హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్ అని పెట్టారు. దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఎందుకంటే.. యాదవులు అంటే గొర్రెలు, మేకలు కాకుండా గేదెలు, ఇతర పశువులను కూడా కాస్తారని, కానీ కురుమ, కురువలు గొర్రెలు మాత్రమే కాస్తారని అన్నారు. యాదవులు BC-Dలో కేటగిరీలో ఉండగా, కురుమలు ఇంకా వెనకబడిన వర్గానికి చెంది BC-B లో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తమ పేరు చివర కురుమ అని పెట్టుకుంటామని, యాదవుల కుల దైవం మల్లన్న కాగా, తమ కుల దైవం బీరప్ప అని అన్నారు. ఇలా రెండు కులాలకు భిన్న అంశాలు ఉన్నాయని, అందువల్ల ఇది తమ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉందని అన్నారు.
కనుక హీరో పేరును మార్చాలని, యాదవ్ అనే పదాన్ని తొలగించినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేస్తే ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…