గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Keerthy Suresh : సొంత యూట్యూబ్ చాన‌ల్‌ను ప్రారంభించిన కీర్తి సురేష్‌.. స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి..

Keerthy Suresh : తెలుగులో మ‌హాన‌టి చిత్రం ద్వారా కీర్తి సురేష్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె ద‌శ ఒక్క‌సారిగా తిరిగిపోయింది. దీంతో ఆమెకు ప‌లు వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే మ‌హాన‌టి త‌రువాత…

Keerthy Suresh : సొంత యూట్యూబ్ చాన‌ల్‌ను ప్రారంభించిన కీర్తి సురేష్‌.. స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి..

Keerthy Suresh : తెలుగులో మ‌హాన‌టి చిత్రం ద్వారా కీర్తి సురేష్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె ద‌శ ఒక్క‌సారిగా తిరిగిపోయింది. దీంతో ఆమెకు ప‌లు వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే మ‌హాన‌టి త‌రువాత అంత‌గా చెప్పుకునే హిట్‌లేవీ ఈమెకు రాలేదు. అయిన‌ప్ప‌టికీ అవ‌కాశాలు మాత్రం పుష్క‌లంగానే వ‌స్తున్నాయి.

Keerthy Suresh started her own youtube channel

ఇక కీర్తి సురేష్ తాజాగా యూట్యూబ్ ఛాన‌ల్‌ను ప్రారంభించింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. త‌న చాన‌ల్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని, త‌న చాన‌ల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల‌ని, అందులో వ‌చ్చే వీడియోల‌ను వీక్షించాల‌ని.. కీర్తి సురేష్ కోరింది.

కీర్తి సురేష్ తాజాగా న‌టించిన చిత్రం గుడ్ ల‌క్ స‌ఖి. ఈ మూవీ ఇప్ప‌టికే అనేక సార్లు వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 28వ తేదీన విడుద‌ల కానుంది. ఇందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతం నుంచి వ‌చ్చి షూటింగ్ చాంపియ‌న్‌గా ఎలా మారింది ? అన్న క‌థ‌ను చూపించ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌గా.. ఈ కార్య‌క్ర‌మానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆక‌ట్టుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి