Keerthy Suresh : కీర్తి సురేష్ ఫ‌స్ట్ టైమ్‌ అందాల ప్ర‌ద‌ర్శ‌న.. అమ్మ‌డు రూటు మార్చిందా ?

June 28, 2022 7:18 PM

Keerthy Suresh : కీర్తిసురేష్ పేరు చెప్ప‌గానే మ‌న‌కు ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోయిన్ గుర్తుకు వ‌స్తుంది. ఆమె చేసిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. కానీ ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మొన్నీ మ‌ధ్య విడుద‌లైన స‌ర్కారు వారి పాట ఓకే అనిపించుకున్నా.. ఈమెకు మాత్రం ఎక్క‌డో ఏదో వెలితిగానే ఉంది. గ‌తంలో ఈమె న‌టించిన చిత్రాలు అన్నీ వ‌రుస‌గా ఫ్లాప్‌లు అయ్యాయి. స‌ర్కారు వారి పాట కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఈ మూవీ వ‌ల్ల బ్రేక్ తీసుకుందామ‌నుకుంటే పొర‌పాటు. ఎందుకంటే ఇప్పుడు జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే కీర్తి సురేష్ కెరీర్ కాస్తా ప్ర‌మాదంలో ప‌డుతుంది. అందుక‌నే కాబోలు.. అమ్మ‌డు రూటు మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గ్లామ‌ర్ షోకు తెర తీసింది.

కీర్తి సురేష్ తాజాగా వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. గ‌తంలో ఈమె ఎన్న‌డూ ఇలా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. కానీ లేటెస్ట్ లుక్‌ను చూసి అంద‌రూ షాక‌వుతున్నారు. హోమ్లీగా ఉండే ఈ బ్యూటీ ఇలా రెచ్చిపోయింది ఏంట‌బ్బా.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే గ్లామ‌ర్ షో చేయ‌డం ద్వారా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సిగ్న‌ల్ పంపిందా.. అని అనుమానాలు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా.. ఈమె అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు మాత్రం యువ‌త ఫిదా అవుతున్నారు. కీర్తి సురేష్ గ్లామ‌ర్ షో చూసి యువ‌త మైమ‌రిచిపోతున్నారు.

Keerthy Suresh latest white color dress photos viral
Keerthy Suresh

ఇక ఈమె సినిమాల విష‌యానికి వ‌స్తే.. వాషి అనే మ‌ళ‌యాళం మూవీతోపాటు త‌మిళంలో మామ‌న్న‌న్‌, తెలుగులో ద‌స‌రా, బోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవి వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మ‌ధ్య‌లో ఈమె ఏమైనా మూవీలు చేస్తుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now