గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Keerthy Suresh : మ‌హా న‌టి కీర్తి సురేష్ బంగ్లా వాల్యూ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Keerthy Suresh : సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ తన అందం, నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకుంది. టాలీవుడ్ లో మహానటిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అచ్చం సావిత్రిలా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.…

Keerthy Suresh : మ‌హా న‌టి కీర్తి సురేష్ బంగ్లా వాల్యూ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Keerthy Suresh : సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ తన అందం, నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకుంది. టాలీవుడ్ లో మహానటిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అచ్చం సావిత్రిలా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. నిజంగా సావిత్రే వచ్చి నటించారా అనే స్థాయిలో ఈ సినిమా హిట్ అయ్యింది. ఈ పాత్రలో వంద శాతం ప్రాణం పెట్టిన హీరోయిన్ కీర్తి సురేష్ నటన అత్యద్భుతం అంటూ ప్రతిఒక్కరూ మెచ్చుకున్నారు.

Keerthy Suresh house value you will be shocked to know

కీర్తి సురేష్ చెన్నైలో పుట్టి పెరిగింది. తమిళనాడులోనే ఆమె ఎడ్యుకేషన్ ను పూర్తి చేసింది. ఫ్యాషన్ డిజైనర్ గా డిగ్రీ సాధించింది. ఈమె తండ్రి సురేష్ కుమార్. ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. తల్లి మేనక. ఆమె కూడా నటి. కీర్తి సురేష్ తన చిన్నప్పుడే బాలనటిగా పైలెట్ అనే మలయాళం సినిమాలో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చదువుకు బ్రేక్ పడుతుందని యాక్టర్ గా దూరమై చదువుకుంది. అలా ఆమె ఎడ్యూకేషన్ కంప్లీట్ అయ్యాక గీతాంజలి అనే సినిమాలో నటించింది.

ఆ తర్వాత 2016 లో రిమూవ్ అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేను శైలజ అనే సినిమాతో పరిచయం అయ్యి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రజంట్ కీర్తి సురేష్, మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఓ స్టార్ హీరోకి చెల్లెలిగా నటిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ దగ్గర రెండు కాస్ట్లీ కార్లు ఉన్నాయి. వాటి వాల్యూ దాదాపుగా కోటి రూపాయలు ఉంటుందని అంచనా. కేరళలోని త్రివేండ్రంలో ఉంటున్న కీర్తి సురేష్ ఇంటి విలువ రూ.5 కోట్లట. ఈ విషయం తెలిసినవారు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఒక్కో సినిమా కోసం రూ.2 కోట్లు తీసుకుంటుందట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి