Karthikeya 2 : టాలీవుడ్ లో గత రెండు వారాలుగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. వరుసగా విడుదలవుతున్న చిత్రాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 సినిమాల్లో మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవగా, కార్తికేయ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది.
మొదటి రోజు కాస్త తక్కువగానే కలెక్షన్లు వచ్చినా.. నాలుగవరోజుకి స్క్రీన్ కౌంట్ మూడింతలయింది. కంటెంట్ ఉంటే.. కలెక్షన్లకు అడ్డేదీ ఉండదని ఈ సినిమా నిరూపించింది. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కార్తికేయ 2 భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ జీ5తో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అతని మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు అభిషేక్ తాజాగా కార్తికేయ 2 ను కూడా జీ5 కే అమ్మినట్టు తెలుస్తోంది. సినిమా విడుదలైన ఆరు వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ త్వరలోనే ప్రకటించనుంది. కార్తికేయ 2.. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో నిఖిల్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…