Kangana Ranaut : త‌న‌కు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో.. చెప్పేసిన కంగ‌నా ర‌నౌత్‌..!

Kangana Ranaut : బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈమె బీజేపీ స‌పోర్ట‌ర్‌. క‌నుక ఎల్ల‌ప్పుడూ ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్‌గా చేసుకుని ఈమె కామెంట్స్ చేస్తుంటుంది. గ‌తంలో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహ‌త్య చేసుకున్న స‌మయంలో కంగ‌నా ర‌నౌత్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టించాయి. బాలీవుడ్‌లో బంధు ప్రీతి వ‌ల్లే సుశాంత్ సింగ్ చ‌నిపోయాడ‌ని.. ఆమె అప్ప‌ట్లో దుమారం రేపేలా వ్యాఖ్య‌లు చేసింది. ఆ త‌రువాత నుంచి అడ‌పా ద‌డ‌పా ఈమె అలాంటి కామెంట్ల‌నే చేస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇక మ‌రోమారు ఈమె పేరు తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌లేదు.. కానీ త‌న జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

 

కంగ‌నా రనౌత్ ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే ఆమె హోస్ట్ చేసిన లాక‌ప్ అనే రియాలిటీ షో ముగిసింది. ఇక ఈమె ఇటీవ‌ల న‌టించిన ధాక‌డ్ అనే చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మే 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను చేప‌డుతున్నారు. అందులో భాగంగా మీడియా సంస్థ‌ల‌కు కంగ‌నా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. ఇక ఆమెకు ఇంట‌ర్వ్యూల్లో భాగంగా చిత్ర‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి.

Kangana Ranaut

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె పాల్గొన‌గా.. ఒక‌రు ఆమెను.. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు, మీ తోటి న‌టీన‌టులు అంద‌రూ పెళ్లిళ్లు చేసుకున్నారు క‌దా, వారికి పిల్ల‌లు కూడా పుడుతున్నారు, కానీ మీరు ఇంకా పెళ్లి ప్ర‌య‌త్నాలే చేయ‌డం లేదు.. అని అడ‌గ్గా.. అందుకు కంగ‌నా బ‌దులిస్తూ.. తాను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ఫైర్ బ్రాండ్‌లా అంద‌రికీ క‌నిపిస్తున్నాన‌ని.. అందుక‌నే త‌న జోలికి వ‌స్తే కొడ‌తాన‌నే ఉద్దేశంతోనే త‌న‌ను ఏ పురుషుడూ పెళ్లి చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని.. కంగ‌నా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

త‌న‌తో కాపురం చేస్తే తాను ఎక్క‌డ ఇబ్బంది పెడ‌తాన‌నో అని చెప్పి పురుషులు భ‌య‌ప‌డుతున్నార‌ని.. ఆ విధంగా మీడియా సంస్థ‌లు ప్రచారం చేస్తున్నాయ‌ని.. అందుక‌నే త‌న‌కు పెళ్లి కావ‌డం లేద‌ని.. కంగ‌నా బ‌దులిచ్చింది. ఇక ధాక‌డ్ మూవీ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కింది. ఈ మూవీ నుంచి విడుద‌లైన ట్రైల‌ర్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంటోంది. ఇందులో అర్జున్ రామ్‌పాల్‌, దివ్య ద‌త్తా ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ఆసక్తి నెల‌కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM