Kamya Punjabi : బయటకు వెళ్లినప్పుడు మనం సహజంగానే కొన్ని సందర్భాల్లో ఫోన్లు లేదా పర్సులను మరిచిపోతుంటాం. దీంతో ఒక్కోసారి తీవ్ర నష్టం కలుగుతుంది. మనకు గుర్తుకు వచ్చి మన వస్తువులను మనం తీసుకుంటే ఓకే. లేదంటే మన వస్తువులు మనకు ఇక దొరకవు. ఒకసారి వస్తువులను మరిచాక తిరిగి వెళ్లి వెదికినా అవి కనిపించవు. ఒక వేళ కనిపిస్తే అది లక్ అని చెప్పవచ్చు. అవును.. సరిగ్గా ఆ నటికి కూడా ఇలాగే జరిగింది. అదృష్టం ఆమె పక్షాన ఉంది కాబట్టే రూ.1 లక్షను పోగొట్టుకున్నట్లే అయింది. కానీ మళ్లీ ఆమె డబ్బులు ఆమెకు దక్కాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
హిందీ నటి కామ్య పంజాబీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఓ ప్రముఖ పానీ పూరీ స్టాల్‌లో ఆమె పానీ పూరీలను టేస్ట్ చేసింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే ఆ సందడిలో పడి ఆమె అక్కడ టేబుల్ మీద పెట్టిన రూ.1 నగదు ఉన్న ఓ కవర్‌ను మరిచిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే తన దగ్గర ఉంచుకున్న రూ.1 లక్ష కనిపించడం లేదని తరువాత తెలిసింది. దీంతో ఆ కవర్‌ను అక్కడే వదిలేసినట్లు నిర్దారించుకుని వెంటనే తన మేనేజర్‌ను అక్కడికి పంపించి కవర్ తీసుకురావాలని చెప్పింది. డబ్బు ఉంది కనుక కవర్ అక్కడ ఉండదేమోనని.. అసలు ఆ లక్ష రూపాయలు మళ్లీ తన దగ్గరకు రావేమోనని ఆమె ఆందోళన చెందింది. కానీ ఆమె మేనేజర్ అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ డబ్బులు ఉన్న కవర్ అక్కడే ఉంది. దీంతో మళ్లీ తన డబ్బు తన దగ్గరకు చేరింది. ఈ క్రమంలోనే ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. సాధారణంగా ఇలాంటి సంఘటనల్లో మనం పోగొట్టుకున్న డబ్బు మనకు వెనక్కి రాదు. ఎప్పుడో ఒక సారి లక్ బాగుంటేనే ఇలా జరుగుతుంది. ఇప్పుడు కామ్య పంజాబీకి కూడా ఇలాగే జరిగింది. దీంతో ఆమెకు లక్ బాగా ఉందని.. లేకపోతే డబ్బులు పోయి ఉండేవని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…