గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Soundarya : ప్లీజ్‌ నన్నలా అనకండి.. వేడుకుంటున్న జూనియర్‌ సౌందర్య..

Soundarya : గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో అచ్చం సౌందర్య రూపురేఖలతో ఉన్న చిత్ర అనే అమ్మాయి ఫోటోలు, వీడియోలు చేస్తుండడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు…

Soundarya : ప్లీజ్‌ నన్నలా అనకండి.. వేడుకుంటున్న జూనియర్‌ సౌందర్య..

Soundarya : గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో అచ్చం సౌందర్య రూపురేఖలతో ఉన్న చిత్ర అనే అమ్మాయి ఫోటోలు, వీడియోలు చేస్తుండడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు అచ్చం సౌందర్య పోలికలతో ఉండటంతో సౌందర్య మళ్ళీ పుట్టిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు ఆమె వీడియోలు, ఫోటోలపై పాజిటివ్ కామెంట్ల కన్నా నెగిటివ్ కామెంట్లు అధికంగా చేయడంతో ఈ కామెంట్లపై జూనియర్ సౌందర్య స్పందించింది.

junior Soundarya  requests netizen not to post negative comments

ఈ క్రమంలోనే జూనియర్ సౌందర్య స్పందిస్తూ.. తాను ఆ వీడియోలు చేయడానికి గల కారణం చాలా మంది నెటిజన్లు తనని అచ్చం సౌందర్య పోలికలతో ఉన్నానని కామెంట్ చేశారని తెలిపింది. అదే విధంగా తాను వ్యక్తిగతంగా సౌందర్య అభిమాని కావడంతో పలువురు నెటిజన్ల కోరిక మేరకు తనని ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నానని ఈ క్రమంలోనే తనను ప్రోత్సహించిన వారందరికీ తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

అయితే చాలామంది పాజిటివ్ కామెంట్లు కన్నా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, తనకు, సౌందర్యకు పోలిక ఏంటని తన కలర్, తన రూపురేఖల గురించి దారుణంగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని ఆమె తన బాధను వ్యక్తపరిచింది. దయచేసి ఎవరూ నన్ను తిట్టకండి, నేను సౌందర్య అంత గొప్పదాన్ని కాదు, కాకపోతే కొందరి కోరిక మేరకు ఆమెలా ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నానని, వీటిని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు.. అంటూ కోరింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి