Jr NTR : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో నుంచే లైగర్ కి డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది. ఎంతో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సినిమా ఏ మాత్రం అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే పరమ చెత్త సినిమా అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకి వచ్చిన నెగెటివ్ టాక్ ను బట్టి చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు మిగిలిస్తుందనే క్లారిటీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసి షాక్ తిన్నారు. పూరీ జగన్నాథ్ కు మళ్లీ కష్టాలు తప్పవంటూ చర్చలు వినిపిస్తున్నాయి.
లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 2015లో ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో టెంపర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటు వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న ఎన్టీఆర్‌కు, అటు పూరీకి టెంపర్ సినిమా సక్సెస్ ఇవ్వడంతో ఇద్దరూ మళ్లీ సక్సెస్ ఫ్రేమ్ లోకి వచ్చేశారు. ఈ సక్సెస్ క్రేజ్ తో పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ తో మరొక ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకుని పూరీ లైగర్ సినిమా కథను ఎన్టీఆర్‌కు చెప్పారట. అయితే అప్పటికే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు.
ఒకవేళ ఎన్టీఆర్ కనుక లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ కెరీర్ లో మరో పెద్ద డిజాస్టర్ గా లైగర్ చిత్రం నిలిచేది. తనకు బాక్సర్ క్యారెక్టర్ సెట్ కాదని వెంటనే ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ కి నో చెప్పటం జరిగిందట. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లక్కీ అని చెప్పుకోవచ్చు. 2004లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ఆంధ్రావాలా కూడా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒకవేళ ఎన్టీఆర్ కనుక లైగర్ చిత్రంలో నటించి ఉంటే టెంపర్ చిత్రంతో సక్సెస్‌ను అందుకొని, లైగర్ తో తన కెరీర్ ని తనే చేతులారా నాశనం చేసుకునేవాడు ఎన్టీఆర్. 6 సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ లైగర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడని ఇప్పుడు జడ్జిమెంట్ వినిపిస్తోంది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…