---Advertisement---

Niharika Konidela : నిహారిక గ‌ర్భ‌వ‌తి అయిందా..? సీక్రెట్ మెసేజ్‌లు వైర‌ల్‌..!

July 26, 2022 7:53 AM
---Advertisement---

Niharika Konidela : ప్ర‌స్తుత త‌రుణంలో సెల‌బ్రిటీల గురించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వాటిల్లో చాలా వ‌ర‌కు పుకార్లే ఉంటున్నాయి. కానీ అవే నిజం అవుతున్నాయి. గ‌తంలో స‌మంత, చైత‌న్య విడిపోతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు అదే నిజం అయింది. ఆ త‌రువాత కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెంట్ అయింద‌ని వార్తలు వ‌చ్చాయి. దీంతో ఆమె ఆ విష‌యాన్ని వెల్ల‌డించ‌క త‌ప్ప‌లేదు. ఇలా సెల‌బ్రిటీల గురించి వ‌స్తున్న వార్త‌లు అనేకం నిజ‌మే అవుతున్నాయి. ఈమ‌ధ్యే ప‌విత్ర లోకేష్‌, న‌రేష్‌ల వ్య‌వ‌హారంపై పుకార్లు వ‌చ్చాయి. త‌రువాత అవే నిజ‌మ‌య్యాయి. అయితే ఇలాంటి పుకార్ల‌లో కొన్ని ఫేక్ కూడా ఉంటున్నాయి. దీంతో ఏ వార్త నిజ‌మైంది.. అని ఎవ‌రికీ తెలియడం లేదు. ఇక మ‌రోవార్త కూడా ఇలాగే వైర‌ల్ అవుతోంది.

మెగా డాట‌ర్‌గా పేరు గాంచిన నిహారిక గ‌ర్భ‌వ‌తి అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె త‌న స్నేహితురాళ్ల‌కు ఓ మెసేజ్‌ను సీక్రెట్‌గా పంపింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు మేము ఇద్ద‌రం.. ఇక‌పై ముగ్గురం.. మా లైఫ్‌లోకి ఇంకొక‌రు వ‌స్తున్నారు.. అంటూ ఆమె త‌న ఫ్రెండ్స్‌కు ఒక మెసేజ్‌ను సీక్రెట్‌గా పంపింద‌ట‌. కానీ అది లీకైంద‌ని తెలుస్తోంది. దీంతో ఆ మెసేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఆ మెసేజ్‌పై మెగా ఫ్యామిలీ స్పందించ‌లేదు. కానీ నాగ‌బాబు ఇప్ప‌టికే పుట్టింటి నుంచి కుమార్తెకు సారె కూడా పంపించార‌ట‌. త్వ‌ర‌లోనే సీమంతం చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. ఇక దీనిపై క్లారిటీ అయితే రావ‌ల్సి ఉంది.

is Niharika Konidela pregnant a message is viral
Niharika Konidela

కాగా నిహారిక ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. రీసెంట్‌గా ఈమె చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌, చిన్న కుమార్తె శ్రీ‌జ‌ల‌తో క‌ల‌సి షాపింగ్‌, బేకరీ, రెస్టారెంట్స్‌కు వెళ్లి సంద‌డి చేసింది. ఆ వీడియోను కూడా షేర్ చేసింది. ఇక డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం అనంత‌రం కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న నిహారిక మ‌ళ్లీ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్టివేట్ చేసి అందులో ఫొటోల‌ను వ‌రుస‌గా పోస్ట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే నిహారిక గ‌ర్భ‌వ‌తి అన్న వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కానీ ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now