గురువారం, జూన్ 11, 2026
విద్య & ఉద్యోగం

10 పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త.. మిలటరీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు చేయాలనీ కోరుకునే అమ్మాయిలకు ఇది ఒక శుభవార్త.ఉమెన్ మిలిటరీ పోలీస్‌లో సోల్జర్ జనరల్ డ్యూటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా…

10 పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త.. మిలటరీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు చేయాలనీ కోరుకునే అమ్మాయిలకు ఇది ఒక శుభవార్త.ఉమెన్ మిలిటరీ పోలీస్‌లో సోల్జర్ జనరల్ డ్యూటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 100 ఉద్యోగాలకు 10 పాసైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ జూలై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెల్గామ్, పూణె, షిల్లాంగ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థులకు మెయిల్ వస్తుంది. మీ అడ్మిట్ కార్డులో ఉన్న తేదీ రోజు మీరు ఈ ప్రాంతానికి చేరుకుంటే సరిపోతుంది.

మొత్తం ఖాళీగా ఉన్న 100 పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పని సరిగా పది ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు మధ్య ఉండాలి.ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://joinindianarmy.nic.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి