గురువారం, జూన్ 11, 2026
ఉద్యోగాలు

భారత సైన్యంలో లా ఆఫీసర్ ఉద్యోగాలు.. జడ్జ్ అడ్వకేట్ జనరల్ ఎంట్రీకి నోటిఫికేషన్!

లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) బ్రాంచ్ 124వ కోర్సు (అక్టోబర్ 2026) కోసం పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

భారత సైన్యంలో లా ఆఫీసర్ ఉద్యోగాలు.. జడ్జ్ అడ్వకేట్ జనరల్ ఎంట్రీకి నోటిఫికేషన్!
భారత సైన్యంలో జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) విభాగంలో నియామకాలు. Photo Credit: Indian Army.
Indian Army JAG entry scheme recruitment 2026 for law graduates.
భారత సైన్యంలో జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) విభాగంలో నియామకాలు. Photo Credit: Indian Army.

లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) బ్రాంచ్ 124వ కోర్సు (అక్టోబర్ 2026) కోసం పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 27న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27, 2026తో ముగుస్తుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 8 ఖాళీలను (పురుషులు, మహిళలు) భర్తీ చేయనున్నారు.

వయో పరిమితి..

2026 జూలై 1 నాటికి కనీస వయస్సు 21 ఏళ్లు, గరిష్ట వయస్సు 27 ఏళ్లు ఉండాలి. అంటే అభ్యర్థులు 02 జూలై 1999కి ముందు జ‌న్మించి ఉండకూడదు. 01 జూలై 2005 తర్వాత జ‌న్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలుపుకొని).

విద్యార్హతలు..

  • LLB డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ఇది క్రింది రెండు కోర్సులకు వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్ అనంతరం చేసిన 3 సంవత్సరాల LLB, ఇంటర్ (10+2) తర్వాత చేసిన 5 సంవత్సరాల LLB.
  • CLAT PG 2025 స్కోర్ తప్పనిసరి. 2026లో ప్రారంభమయ్యే ఈ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులందరికీ చెల్లుబాటు అయ్యే CLAT PG 2025 స్కోర్ తప్పనిసరి. ఇందులో ఇప్పటికే LLM పూర్తిచేసినవారు, ప్రస్తుతం LLM చదువుతున్నవారు కూడా ఉంటారు.

బార్ కౌన్సిల్ అర్హత..

అభ్యర్థి భారత బార్ కౌన్సిల్ లేదా సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకునే అర్హత కలిగి ఉండాలి. అలాగే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి చదివి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి? (ఆన్‌లైన్ విధానం):

  • www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • Officer Entry Appln/Login → Registration పై క్లిక్ చేయాలి (ఇప్పటికే రిజిస్టర్ అయితే అవసరం లేదు).
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను జాగ్రత్తగా పూరించాలి.
  • లాగిన్ అయి డాష్‌బోర్డ్‌లో Apply Onlineపై క్లిక్ చేయాలి.
  • Officer’s Selection – Eligibility పేజీలో SSC JAG Entry Courseకి Apply చేయాలి.
  • దరఖాస్తును దశలవారిగా పూర్తి చేయాలి.
  • వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు వివరాలు, విద్యార్హతలు, గత SSB వివరాలు, ప్రతి సెక్షన్ తర్వాత Save & Continue పై క్లిక్ చేయాలి.
  • సమ్మ‌రీ పేజీలో అన్ని వివరాలు పరిశీలించి అవసరమైతే సవరణలు చేయాలి.
  • అన్ని వివరాలు సరిచూసిన తర్వాత మాత్రమే Submit చేయాలి.
  • చివరి తేదీ తర్వాత 30 నిమిషాల వ్యవధిలో రోల్ నంబర్‌తో కూడిన దరఖాస్తు రెండు ప్రింట్ కాపీలు తీసుకోవాలి.

ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

గ‌మ‌నిక‌: అభ్య‌ర్థులు అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి పూర్తి స‌మాచారాన్ని ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి