భార‌త‌దేశం

విజయ్ పార్టీ ఎఫెక్ట్: చెపాక్ స్టేడియంలో ఈలలపై నిషేధం.. పొలిటికల్ సెగ!

చెపాక్ స్టేడియంలో ఈలల నిషేధంపై చెలరేగుతున్న రాజకీయ దుమారం. Photo Credit: News9 Live.

చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్‌లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లతో ఈ నిర్ణయం అమలవుతోంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రేక్షకులు స్టేడియంలోకి విజిల్‌లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. శబ్దం చేసే పరికరాలన్నింటినీ నిషిద్ధ వస్తువుల జాబితాలో చేర్చారు. ఫిబ్రవరి 8న జరిగిన న్యూజిలాండ్-ఆఫ్గ‌నిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌తో ఈ నిబంధనను మొదటిసారి అమలు చేశారు. ఎంట్రీ గేట్ల వద్ద కఠిన తనిఖీలు నిర్వహించారు. స్టేడియం వెలుపల విజిల్‌లు అమ్మ‌వ‌ద్ద‌ని విక్రేత‌ల‌కు కూడా సూచనలు ఇచ్చారు. మొదట్లో ఈ నిబంధనను స్థానిక పోలీసులు విధించారని వార్తలు వచ్చాయి. కానీ తరువాత స్టేడియం యాజమాన్యం ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. శబ్దం వల్ల ఆటకు అంతరాయం కలిగించే వస్తువులపై ఇది సాధారణ నిబంధన అని పేర్కొన్నారు. తాజాగా TNCA అధికారికంగా ప్రకటించడంతో చెపాక్‌కు ఇది శాశ్వత నిబంధనగా మారింది.

విజిల్‌కు ప్ర‌త్యేక స్థానం..

చెన్నైలో విజిల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో విజిల్ పోడు నినాదం అభిమానులలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. మ్యాచ్‌ల సమయంలో విజిల్‌లు ఊదడం చెపాక్ సంస్కృతిలో భాగంగా మారింది. అయితే ఇటీవల తమిళగ వెట్రి కజగం (TVK)కు ఎన్నికల గుర్తుగా విజిల్ ను కేటాయించడంతో ఈ సాధారణ వస్తువు రాజకీయ రంగు పులుముకుంది. టీవీకేకు నాయకత్వం వహిస్తున్న విజయ్ రాజకీయ ప్రవేశంతో ఈ అంశం మరింత సున్నితంగా మారింది. ఈ నేపథ్యంలోనే నిషేధం రావడంతో టైమింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై CSK సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించేందుకు నిరాకరించారు.

ఐపీఎల్ సీజ‌న్‌లో ఎలా..?

విజిల్ నిషేధంపై CSK అభిమానులు, టీవీకే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలక డీఎంకేపై ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే TNCA, పోలీసులు ఇది సాధారణ భద్రతా చర్య మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. వరల్డ్ కప్ వేదికలన్నింటిలో ఇలాంటి నిబంధనలు అమలులో ఉంటాయని చెబుతున్నారు. అయితే త్వ‌ర‌లో మొద‌లు కానున్న ఐపీఎల్ సీజ‌న్ గురించే ఇప్పుడు చ‌ర్చంతా న‌డుస్తోంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కాలంతో కలిసివస్తోంది. చెపాక్‌లో జరిగే CSK హోం మ్యాచ్‌లలో కూడా ఈ నిషేధం కొనసాగుతుందా అనే దానిపై స్పష్టత లేదు. నిషేధం కొనసాగితే స్టేడియం రాజకీయ వేదికగా మారకుండా అడ్డుకునే చర్యగా భావించే అవకాశం ఉంది. అదే సమయంలో మరో వివాదానికి ఇది దారితీయవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఐపీఎల్‌లో ఏమ‌వుతుందో వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM