IND Vs ENG : బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఇంగ్లండ్‌పై 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ తడబడింది. పేకమేడలా ఆ జట్టు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయారు. దీంతో భారత్ ఇంగ్లండ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. సిరీస్‌ను కైవసం చేసుకుని 2-0 ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో రవీంద్ర జడేజా, కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు రాణించారు. 29 బంతుల్లో జడేజా 5 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా.. రోహిత్ శర్మ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. పంత్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు పడగొట్టగా రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరంభం నుంచి తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోతూనే వచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ 17 ఓవర్లలోనే 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో మొయిన్ అలీ (35 పరుగులు), డేవిడ్ విల్లీ (33 నాటౌట్) తప్ప మిగిలిన ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కాగా భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రిత్ బుమ్రా, యజువేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, హర్షల్ పటేల్‌లు చెరొక వికెట్ చొప్పున తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకోగా.. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ ఆదివారం నాటింగామ్‌లో జరగనుంది.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…