గురువారం, జూన్ 11, 2026
టెక్నాల‌జీ

ఈ 8 యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే వెంట‌నే డిలీట్‌ చేయండి.. ఎందుకంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడేవారికి వైర‌స్‌లు, మాల్‌వేర్‌ల బెడ‌ద ఎక్కువే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అనేక యాప్స్‌లో ఇప్ప‌టికీ వైర‌స్‌లు, మాల్‌వేర్‌లు ఇన్‌ఫెక్ట్ అయిన యాప్‌లు చాలానే ఉన్నాయి. వాటిని గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి తొల‌గిస్తూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ…

ఈ 8 యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే వెంట‌నే డిలీట్‌ చేయండి.. ఎందుకంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడేవారికి వైర‌స్‌లు, మాల్‌వేర్‌ల బెడ‌ద ఎక్కువే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అనేక యాప్స్‌లో ఇప్ప‌టికీ వైర‌స్‌లు, మాల్‌వేర్‌లు ఇన్‌ఫెక్ట్ అయిన యాప్‌లు చాలానే ఉన్నాయి. వాటిని గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి తొల‌గిస్తూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ ఎప్పుడూ ఆ యాప్‌లు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి కొన్ని యాప్‌ల‌ను తాజాగా గుర్తించారు.

if you have these 8 apps in your phone then delete them immediately

1. Auxiliary Message

2. Fast magic SMS

3. Free CamScanner

4. Super Message

5. Element Scanner

6. Go messages

7. travel wallpapers

8. Super SMS

పైన తెలిపిన 8 యాప్‌ల‌ను గ‌న‌క మీరు వాడుతున్న‌ట్ల‌యితే వెంట‌నే ఈ యాప్‌ల‌ను ఫోన్‌ల‌లోంచి తీసేయండి. ఎందుకంటే ఈ యాప్‌ల‌కు జోక‌ర్ అనే మాల్‌వేర్ ఇన్‌ఫెక్ట్ అయింది. అందువల్ల ఈ యాప్‌ల‌ను వెంట‌నే తీసేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

నిజానికి జోక‌ర్ యాప్ గ‌తేడాది కూడా ప‌లు యాప్‌ల‌కు ఇన్‌ఫెక్ట్ అయింది. దీంతో గ‌తేడాది ఈ వైర‌స్ ఇన్‌ఫెక్ట్ అయిన 40 యాప్‌ల‌ను గూగుల్ త‌న ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. ఇక ఇప్పుడు తాజాగా మ‌రో 8 యాప్‌ల‌ను తీసేసింది. అందువ‌ల్ల ఈ యాప్‌ల‌ను ఉప‌యోగిస్తున్న‌వారు వెంట‌నే వాటిని తీసేయాల‌ని, త‌రువాత ఫోన్ల‌ను యాంటీ వైర‌స్ యాప్‌ల‌తో పూర్తిగా స్కాన్ చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి